Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ 10వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. టాప్ 6 స్థానాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. గతవారం ఉన్న సీరియల్సే ఇప్పుడూ కొనసాగాయి. అయితే 2 నుంచి 4 స్థానాల్లో మాత్రం గట్టి పోటీ నెలకొంది. తరచూ ఈ మూడు స్థానాల్లోని సీరియల్స్ కాస్త పైకి, కిందికి మారుతూ ఉన్నాయి.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ చూస్తే.. కార్తీకదీపం 2 సీరియల్ దుమ్ము రేపింది. 10వ వారం రిలీజైన రేటింగ్స్ లో ఈ సీరియల్ ఏకంగా 13.78 రేటింగ్ సాధించడం విశేషం. అటు అర్బన్, ఇటు రూరల్.. రెండు ప్రాంతాల్లోనూ ఈవారం కార్తీకదీపమే టాప్ లో ఉంది. ఇప్పట్లో ఈ సీరియల్ టాప్ ప్లేస్ ను ఆక్రమించడం మరో సీరియల్ కు సాధ్యమయ్యేలా లేదు.
అయితే రెండో స్థానంలోకి మరోసారి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ దూసుకొచ్చింది. ఈ సీరియల్ తాజాగా 12.45 రేటింగ్ సాధించింది. ఇక మూడో స్థానంలో ఇంటింటి రామాయణం ఉంది. దీనికి 12.30 రేటింగ్ వచ్చింది. గుండె నిండా గుడి గంటలు నాలుగో స్థానానికి పడిపోయింది. పదో వారం రేటింగ్స్ లో ఈ సీరియల్ కు 11.96 రేటింగ్ నమోదైంది.
ఐదు, ఆరు స్థానాల్లో చిన్ని, నువ్వుంటే నా జతగా సీరియల్స్ ఉన్నాయి. చిన్ని సీరియల్ కు 10.04 రేటింగ్ రాగా.. నువ్వుంటే నా జతగా 8.41 సాధించింది. దీంతో టాప్ 6లో మొత్తం స్టార్ మా సీరియల్సే ఉన్నాయి. ఇక సత్యభామ స్థానంలో కొత్తగా ప్రారంభమైన భానుమతి సీరియల్ తొలి వారం రేటింగ్ అంత ఆశాజనకంగా లేవు. అర్బన్, రూరల్ కలిపి కేవలం 2.99 రేటింగే వచ్చింది.
జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే.. చామంతి సీరియల్ హవా కొనసాగుతోంది. ఎన్నో రోజులుగా ఈ ఛానెల్లో వస్తున్న అన్ని సీరియల్స్ ను వెనక్కి నెట్టి.. ఈ కొత్త సీరియల్ సత్తా చాటుతోంది. తాజాగా 10వ వారానికి రిలీజ్ అయిన టీఆర్పీ రేటింగ్స్ లో చామంతి 7.08తో టాప్ లో కొనసాగుతోంది. రెండో స్థానంలో జగద్ధాత్రి సీరియల్ ఉంది. ఈ సీరియల్ కూడా గట్టి పోటీ ఇస్తోంది. తాజా రేటింగ్స్ లో 7.05 సాధించింది.
ఇక ఆ తర్వాతి స్థానాల్లో మేఘసందేశం (6.81), పడమటి సంధ్యారాగం (6.58), అమ్మాయిగారు (5.77) సీరియల్స్ ఉన్నాయి. జీ తెలుగు వరకు టాప్ 5 సీరియల్స్ ఇవే. కొంతకాలం పాటు వీటిలో ఉన్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్.. టైమ్ మారడంతో పూర్తిగా రేటింగ్ కోల్పోయింది. తాజాగా రేటింగ్స్ లో కేవలం 3.60 మాత్రమే సాధించింది. ఇక లక్ష్మీ నివాసం 5.23, కలవారి కోడలు కనకమహాలక్ష్మి 4.10 రేటింగ్స్ సంపాదించాయి.
సంబంధిత కథనం
టాపిక్