స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ 18వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. టాప్ 5లో చెప్పుకోవదగిన మార్పు అంటే బ్రహ్మముడి మరోసారి ఈ జాబితాలోకి దూసుకురావడమే. ఈ మధ్యకాలంలో మరోసారి ఆ సీరియల్ సత్తా చాటుతోంది. క్రమంగా తన రేటింగ్ పెంచుకుంటూ వెళ్తోంది. ఇక స్టార్ మా సీరియల్స్ ముందు జీ తెలుగు సీరియల్స్ నిలవలేకపోతున్నాయి.
స్టార్ మా సీరియల్స్ కు సంబంధించి బ్రహ్మముడి సీరియల్ మరోసారి టాప్ 5లోకి రావడమే అసలు విశేషం. ప్రైమ్ టైమ్ నుంచి మధ్యాహ్నం స్లాట్ లోకి మారిన తర్వాత ఒక దశలో నంబర్ వన్ స్థానం నుంచి టాప్ 10లోనే లేకుండా పోయిన ఈ సీరియల్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ 5లోకి వచ్చింది.
తాజాగా 18వ వారం రేటింగ్స్ లో 7.82తో ఐదో స్థానంలో నిలవడం విశేషం. కేవలం అర్బన్ రేటింగ్ చూసుకుంటే 6.69 రేటింగ్ నమోదైంది. ఆ లెక్కన బ్రహ్మముడికి క్రమంగా రూరల్ లో ఫాలోయింగ్ పెరుగుతున్నట్లు అర్థమవుతోంది.
ఇక మిగిలిన సీరియల్స్ విషయానికి వస్తే.. టాప్ 10లో 9 స్టార్ మాకు చెందినవే ఉన్నాయి. టాప్ లో కార్తీకదీపం కొనసాగుతోంది. ఈ సీరియల్ తాజాగా 11.45 రేటింగ్ సాధించింది. ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.86 రేటింగ్ తో రెండో స్థానానికి దూసుకొచ్చింది. గుండె నిండా గుడి గంటలు 10.19తో మూడో స్థానంలో, ఇంటింటి రామాయణం 9.69తో నాలుగో స్థానంలో నిలిచాయి.
ఇక బ్రహ్మముడి దెబ్బకు చిన్ని సీరియల్ ఆరో స్థానానికి పడిపోయింది. ఆ సీరియల్ 7.61 రేటింగ్ నమోదైంది. ఏడో స్థానంలో నువ్వుంటే నా జతగా (6.87), 8వ స్థానంలో పలుకే బంగారమాయెనా (6.35), 9వ స్థానంలో నిన్ను కోరి (6.12) సీరియల్స్ ఉన్నాయి.
ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే ఒక్క సీరియల్ మాత్రమే టాప్ 10లో ఉంది. చామంతి సీరియల్ 6.10 రేటింగ్ తో ఆ ఛానెల్లో టాప్ లో, ఓవరాల్ గా పదో స్థానంలో నిలిచింది. మేఘసందేశం 5.89, పడమటి సంధ్యారాగం 5.80, జగద్ధాత్రి 5.44, అమ్మాయిగారు 4.95 రేటింగ్స్ సాధించాయి. స్టార్ మా సీరియల్స్ తో పోలిస్తే.. జీ తెలుగు చాలా వెనుకబడి పోతోంది. ప్రతి వారం ఆ ఛానెల్ సీరియల్స్ రేటింగ్స్ పడిపోతూ వస్తున్నాయి. కేవలం ఒక్క సీరియల్ రేటింగ్ మాత్రమే 6 దాటడం గమనార్హం.
సంబంధిత కథనం
టాపిక్