Serial actresses in Batukamma celebrations: బతుకమ్మ సంబురాల్లో సీరియల్స్ నటీమణులు.. ప్రజలతో మమేకమై..
Serial actresses in Batukamma celebration: బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు సీరియల్స్ నటీమణులు. ప్రజలతో మమేకమై బతుకమ్మ వేడుకల్లో ఆడిపాడారు.

Serial actresses in Batukamma celebrations: తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం బతుకమ్మ సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడలా బతుకమ్మ పాటలు మార్మోగుతున్నాయి. పూలను బతుకమ్మలుగా చేసి.. ఘనంగా వేడుకలు చేసుకుంటున్నారు ప్రజలు. కాగా, ఈ బతుకమ్మ సంబురాల్లో సీరియల్ నటీమణులు కూడా భాగమయ్యారు. ప్రజలతో కలిసి ఆడి, పాడారు. వివరాలివే..
స్టార్ మా టీవీ ఛానెల్‍లో ప్రసారమవుతున్న టీవీ సీరియళ్లలో నటిస్తున్న నటీమణులు.. హైదరాబాద్‍లో కొన్ని దుర్గా మండపాల వద్ద బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. కృష్ణా ముకుంద మురారీ, మామగారు, వంటలక్క, పాపే మా జీవనజ్యోతి సీరియళ్ల నటీమణులు ఎల్‍బీ నగర్‌లోని దుర్గా మండపం వద్ద బతుకమ్మ సంబురాల్లో సందడి చేశారు. ప్రజలతో మమేకమై ఆడిపాడారు. బతుకమ్మలను చేతబడ్డారు.
సీరియల్ నటీమణులు వచ్చేసరికి ప్రజలు చాలా సంతోషపడ్డారు. వారితో ఫొటోలు దిగేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. కొందరికి బహుమతులు కూడా ఇచ్చారు నటీమణులు. తమ అభిమానులతో సంతోషంగా సమయం గడిపారు.
సీరియల్స్ నటీమణులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న విషయాన్ని స్టార్ మా వెల్లడించింది. ఫొటోలను పోస్ట్ చేసింది. తమ ఛానెల్‍లో ప్రసారమయ్యే సీరియళ్లను వీక్షించే వారితో దృఢమైన బంధాన్ని పెంచుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. ప్రేక్షకులతో నటీమణులు సంతోషంగా సమయం గడిపారని తెలిపింది.
గతంలోనూ పలు వేడుకలను ప్రజలతో కలిసి జరుపుకున్నారు సీరియల్స్ నటీనటులు. ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు కృషి చేశారు. శ్రావణ మాసంలో కొన్ని కార్యక్రమాల్లోనూ కొందరు సీరియల్ నటులు పాల్గొన్నారు. ఇప్పుడు బతుకమ్మ సంబురాలను కూడా ప్రజలతో కలిసి చేసుకున్నారు.