Brahmamudi: జీఆర్‌పీ అగ్ర స్థానంలో స్టార్ మా.. అయినా టాప్ 6లో లేని బ్రహ్మముడి.. ఒక్కో సీరియల్ రేటింగ్ ఎంతంటే?-star maa got top 1 place in telugu tv serials grp and brahmamudi did not get chance in star maa top 6 serials trp ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi: జీఆర్‌పీ అగ్ర స్థానంలో స్టార్ మా.. అయినా టాప్ 6లో లేని బ్రహ్మముడి.. ఒక్కో సీరియల్ రేటింగ్ ఎంతంటే?

Brahmamudi: జీఆర్‌పీ అగ్ర స్థానంలో స్టార్ మా.. అయినా టాప్ 6లో లేని బ్రహ్మముడి.. ఒక్కో సీరియల్ రేటింగ్ ఎంతంటే?

Sanjiv Kumar HT Telugu
Jan 19, 2025 04:57 PM IST

Star Maa Top 1 Place In TV Serials GRP Ratings: టీఆర్‌పీ లాంటి జీఆర్‌పీ రేటంగ్‌లో స్టార్ మా టీవీ ఛానెల్ అగ్ర స్థానంలో దంచికొడుతోంది. అయితే, స్టార్ మాలోని టాప్ సీరియల్ బ్రహ్మముడి మాత్రం టాప్ 6 సీరియల్స్‌లో స్థానం సంపాదించుకోలేకపోయింది. టీవీ ఛానెల్స్, సీరియల్స్ రేటింగ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ లుక్కేద్దాం.

జీఆర్‌పీ అగ్ర స్థానంలో స్టార్ మా.. అయినా టాప్ 6లో లేని బ్రహ్మముడి.. ఒక్కో సీరియల్ రేటింగ్ ఎంతంటే?
జీఆర్‌పీ అగ్ర స్థానంలో స్టార్ మా.. అయినా టాప్ 6లో లేని బ్రహ్మముడి.. ఒక్కో సీరియల్ రేటింగ్ ఎంతంటే?

Star Maa Zee Telugu ETV Gemini TV GRP Ratings: సాధారణంగా టీవీ సీరియల్స్, టీవీ ఛానెల్స్ సక్సెస్ అయ్యాయా లేదా ఫెయిల్ అయ్యాయా అనేది ఆ వారానికి సంబంధించిన టీఆర్‌పీ (టార్గెట్ రేటింగ్ పాయింట్)ని బట్టి తెలుస్తుంది. అలాంటిదే జీఆర్‌పీ. అంటే, గ్రాస్ రేటింగ్ పాయింట్ (Gross Rating Point).

రెండు అంశాలను గణించి

టీవీ సీరియల్స్ ప్రసారం అయ్యే సమయంలో యాడ్స్ టార్గెటెడ్ ఆడియెన్స్‌లోకి ఎంతవరకు చేరువయ్యాయో, ఆ ప్రకటనలను ప్రేక్షకులు ఎన్నిసార్లు చూశారు వంటి రెండు అంశాలను గణించి అంచనా వేసేదే జీఆర్‌పీ. సింపుల్‌గా చెప్పాలంటే టీవీ సీరియల్స్‌కు ఉండే రీచ్‌ను, సక్సెస్‌ను లెక్కగట్టేదే గ్రాస్ రేటింగ్ పాయింట్.

నెంబర్ వన్‌గా స్టార్ మా

ఈ జీఆర్‌పీలో స్టార్ మా ఛానెల్ అగ్ర స్థానం సంపాదించుకున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో ప్రకటించింది. అలాగే, మిగతా ఛానెల్స్ జీఆర్‌పీ, టాప్ 6 సీరియల్స్ టీఆర్‌పీని కూడా వెల్లడించింది. స్టార్ మా ఛానెల్ 938 జీఆర్‌పీతో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలవగా.. 629 పాయింట్లతో జీ తెలుగు రెండో స్థానంలో ఉంది. ఇక 342 పాయింట్లతో ఈటీవీ తెలుగు మూడో స్థానం సంపాదించుకుంది.

చివరి రెండు స్థానాల్లో

ఇక చివరి స్థానం అంటే, నాలుగో ప్లేస్‌లో జెమినీ టీవీ నిలిచింది. జెమినీ టీవీ ఛానెల్‌కు 168 జీఆర్‌పీ వచ్చింది. దీంతో అగ్ర స్థానంలో స్టార్ మా, ఆఖరు ప్లేసులో జెమినీ టీవీ ఉన్నాయి. ఈ విషయం తెలియజేస్తూ.. "తెలుగు వినోదరంగ ప్రపంచాన్ని స్టార్ మా పాలిస్తోంది" అంటూ ఆ పోస్టర్‌లో సదరు బుల్లితెర ఛానెల్ రాసుకొచ్చింది.

ప్రైమ్ టైమ్-నాన్ ప్రైమ్ టైమ్

వీటితోపాటు టీవీ ఛానెల్స్‌కు వచ్చిన ప్రైమ్ టైమ్, నాన్ ప్రైమ్ జీఆర్‌పీ వివరాలను కూడా అందులో పొందుపరిచారు. స్టార్ మాకి ప్రైమ్ టైమ్ 454, నాన్ ప్రైమ్ 178 జీఆర్‌పీ ఉండగా.. జీ తెలుగుకు 306 ప్రైమ్ టైమ్, 95 నాన్ ప్రైమ్ టైమ్ పాయింట్స్ ఉన్నాయి. ఈటీవీ తెలుగుకు 145 ప్రైమ్, 31 నాన్ ప్రైమ్, జెమినీ టీవీకి 28 ప్రైమ్, 18 నాన్ ప్రైమ్ జీఆర్‌పీ ఉంది.

దుమ్ములేపుతోన్న కార్తీక దీపం 2

అలాగే, స్టార్ మా తన ఛానెల్‌లోని టాప్ 6 సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్స్‌ను కూడా వెల్లడించింది. 14.3 టీఆర్‌పీతో కార్తీక దీపం 2 సీరియల్ నెంబర్ వన్ ప్లేస్ సంపాదించుకుంది. దీని తర్వాత 13.7 పాయింట్లతో ఇల్లు ఇల్లాలు పిల్లలు రెండో స్థానంతో సత్తా చాటింది. ఇక మూడో స్థానంలో చిన్ని 11.5 పాయింట్లతో, 4వ ప్లేస్‌లో గుండె నిండా గుడి గంటలు 11.4 పాయింట్లతో ఉన్నాయి.

టాప్ 6లో లేని బ్రహ్మముడి

చివరి రెండు స్థానాలు అయిన టాప్ 5లో ఇంటింటి రామాయణం 11.3 టీఆర్‌పీ, టాప్ 6లో మగువ మగువ 9.2 టీఆర్‌పీతో ఆకట్టుకున్నాయి. అయితే, ఒకప్పుడు టాప్ రేటింగ్‌తో దుమ్ముదులిపిన బ్రహ్మముడి సీరియల్ స్టార్ టాప్ 6 సీరియల్స్‌లో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే, ఈ ఆరు సీరియల్స్‌తో బ్రహ్మముడి పోటీ పడలేకపోతోందని తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం