Star Maa Bigg Boss: బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో.. రాయల్స్ వర్సెస్ ఓజీ.. అదిరిపోయింది
Star Maa Bigg Boss: బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో సందడి చేశారు. వచ్చే ఆదివారం (నవంబర్ 10) టెలికాస్ట్ కాబోతున్న ఈ షో ప్రోమోను శుక్రవారం (నవంబర్ 8) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రాయల్స్ వర్సెస్ ఓజీ అంటూ ఈ ప్రోమో సరదాగా సాగిపోయింది.
Star Maa Bigg Boss: స్టార్ మా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లతో ఓ షో చేసింది. ప్రతి ఆదివారం వచ్చే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో కోసం కొందరు మాజీ కంటెస్టెంట్లు వచ్చారు. వాళ్లను రాయల్స్ వర్సెస్ ఓజీ అంటూ గత సీజన్ల కంటెస్టెంట్లు, ఈ సీజన్ కంటెస్టెంట్లతో ఈ షో నిర్వహించింది. శుక్రవారం (నవంబర్ 8) ఐదు నిమిషాలకుపైగా ఉన్న ప్రోమోను రిలీజ్ చేశారు.
రాయల్స్ వర్సెస్ ఓజీ
బిగ్ బాస్ తెలుగు మాజీ, ప్రస్తుత సీజన్ల కంటెస్టెంట్లు ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో యాంకర్ శ్రీముఖితో కలిసి రచ్చ చేశారు. రాయల్స్ వర్సెస్ ఓజీ అంటూ వాళ్లను రెండు గ్రూపులుగా విడదీసి ఈ షోలో గేమ్స్ ఆడించారు. వచ్చే ఆదివారం (నవంబర్ 10) ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే ఈ షో ప్రోమోను రిలీజ్ చేయగా.. సరదాగా సాగిపోయింది.
ఈ షోకి వచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్లను రాయల్స్, ఓజీ గ్రూపులుగా విడదీశారు. ఓజీలు ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు కానీ రాయల్స్ ఎప్పుడూ ఇంత ఎనర్జీతో ఉంటారంటూ వాళ్లను శ్రీముఖి ఇంట్రడ్యూస్ చేసింది. ఈ గ్రూపులో గతంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా ఉన్న అరియానా, తేజస్విని, వీజే సన్నీలాంటి వాళ్లు ఈ గ్రూపులో ఉన్నారు.
ఓజీ గ్రూపులో బేబక్క, నాగ మణికంఠ
ఇక ఆ తర్వాత ఓజీ గ్రూపు వాళ్లు ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో ఈ బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ఉన్నారు. ఆర్జే శేఖర్ బాషా, నాగ మణికంఠ, బేబక్కలాంటి వాళ్లు ఈ గ్రూపులో ఉన్నారు. ఈ సీజన్ నుంచి నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
అలా చేయడంపై శ్రీముఖి స్పందిస్తూ.. నువ్వు మరీ ఇంత పారదర్శకంగా ఉంటావని తాను అనుకోలేదని అంటుంది. ఈ రెండు గ్రూపులు ఎంట్రీ ఇచ్చిన తర్వాత శ్రీముఖి, ఎమాన్యుయేల్ వాళ్లతో సరదాగా గేమ్స్ ఆడించారు. ఆదివారం టెలికాస్ట్ అయ్యే ఈ షో ఫన్నీగా నవ్వులు పూయించనున్నట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది.
స్టార్ మాలో వచ్చే టాప్ షోలలో ఈ ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఒకటి. ఇక ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకెళ్తున్న షో బిగ్ బాస్. ఇప్పుడీ రెండు షోలు కలిశాయి. దీంతో వచ్చే ఆదివారం శ్రీముఖి హోస్ట్ చేసే ఈ షోకి అదిరిపోయే టీఆర్పీలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.