SSMB28 Update: మూడు నెలలు నో గ్యాప్ - జనవరి నుంచి మహేష్ బిజీ
మహేష్‌బాబు (Mahesh Babu) హీరోగా తివిక్రమ్ ( (Trivikram)దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్ జనవరిలో తిరిగి ప్రారంభం కానుంది. లాంగ్ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఎన్ని నెలల పాటు షూటింగ్ జరుపనున్నారంటే...
SSMB28 Update: అతడు, ఖలేజా తర్వాత హీరో మహేష్‌బాబు దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ శైలి ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ భారీ బడ్జెట్ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జనవరి సెకండ్ వీక్‌లో మొదలుకానున్నట్లు తెలిసింది. మార్చి నెలాఖరు వరకు దాదాపు మూడు నెలల పాటు ఏకధాటిగా లాంగ్ షెడ్యూల్‌ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
ట్రెండింగ్ వార్తలు
సెప్టెంబర్‌లోఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. నవంబర్‌లో సెకండ్ షెడ్యూల్‌ను చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో షూటింగ్ వాయిదాపడింది. జనవరిలో ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి మొదలుపెట్టబోతున్నారు. ఈ షెడ్యూల్ నుంచే హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నది.
ఇటీవల ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్‌ను ముంబాయిలో నిర్వహించారు. మహేష్, త్రివిక్రమ్ సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు గతంలో చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. కానీ షూటింగ్‌లో ఆలస్యమవడంతో రిలీజ్ డేట్ వాయిదా పడటం ఖాయంగానే కనిపిస్తోంది. వేసవి తర్వాతే ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మహేష్‌బాబు హీరోగా నటిస్తోన్న 28వ సినిమా ఇది. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈసినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అల వైకుంఠపురములో, అరవింద సమేత వీర రాఘవ తర్వాత తివిక్రమ్ దర్శకత్వంలో పూజాహెగ్డే నటిస్తోన్న సినిమా ఇది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ28తో పాటుగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించాడు మహేష్‌బాబు.