Hit 2 Pre Release Event: హిట్ -2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా జ‌క్క‌న్న‌- సెంటిమెంట్ కంటిన్యూ చేసిన నాని-ss rajamouli to come as a chief guest for the pre release event of hit 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ss Rajamouli To Come As A Chief Guest For The Pre Release Event Of Hit 2

Hit 2 Pre Release Event: హిట్ -2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా జ‌క్క‌న్న‌- సెంటిమెంట్ కంటిన్యూ చేసిన నాని

Nelki Naresh Kumar HT Telugu
Nov 27, 2022 10:10 AM IST

Hit 2 Pre Release Event: అడివిశేష్ హీరోగా న‌టించిన హిట్ -2 సినిమా డిసెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమ‌వారం నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఎవ‌రు హాజ‌రుకానున్నారంటే...

అడివి శేష్‌, రాజ‌మౌళి
అడివి శేష్‌, రాజ‌మౌళి

Hit 2 Pre Release Event: అడివి శేష్ హీరోగా న‌టిస్తోన్న హిట్ -2 సినిమా డిసెంబ‌ర్ 2న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. సైక‌లాజిక‌ల్‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాకు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను న‌వంబ‌ర్ 28న‌ (సోమ‌వారం) హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌బోతున్నారు.

ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి హాజ‌రుకానున్న‌ట్లు చిత్ర యూనిట్‌ ప్ర‌క‌టించింది. హిట్ 2 సినిమాను వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి తిపిరినేనితో క‌లిసి హీరో నాని నిర్మిస్తున్నాడు. 2020లో విశ్వ‌క్‌సేన్ హీరోగా హిట్ ఫ‌స్ట్ కేస్ సినిమాకు సీక్వెల్‌గా హిట్ -2 తెర‌కెక్కుతోంది. హిట్ ఫ‌స్ట్ కేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజ‌మౌళి గెస్ట్‌గా వ‌చ్చాడు.

ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. మ‌రోసారి ఆ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ సీక్వెల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజ‌మౌళిని గెస్ట్‌గా ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం. రాజ‌మౌళితో పాటు ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజ‌రుకాబోతున్న‌ట్లు తెలిసింది.

హిట్ -2 సినిమాలో కృష్ణ‌దేవ్ అలియాస్ కేడీ అనే పోలీస్ ఆఫీస‌ర్‌గా అడివి శేష్ క‌నిపించ‌బోతున్నాడు. మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌తో సినిమాపై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రోవైపు మేజ‌ర్ స‌క్సెస్ త‌ర్వాత అడివి శేష్ హీరోగా న‌టిస్తోన్నసినిమా ఇదే కావ‌డం కూడా హైప్‌కు కార‌ణ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.