హిట్ 3 సినిమా రిలీజ్ సమీపిస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మరో నాలుగు రోజుల్లో మే 1వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (ఏప్రిల్ 27) హైదరాబాద్‍లో జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి ఈ ఈవెంట్‍కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.
మూవీ నుంచి ఏదైనా లీక్ అయితే తమకు లోపల రగిలిపోతూ ఉంటుందని రాజమౌళి అన్నారు. ఓ సందర్భంలో హిట్ 3 గురించి జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు దర్శకుడు శైలేశ్ కోపం తెచ్చుకోకుండా చాలా పరిణితితో సమాధానాలు ఇచ్చారని ప్రశంసించారు. “హిట్ 3 కోసం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ చూశా. సాధారణంగా మా దర్శకులు, ప్రొడ్యూజర్లు సినిమావాళ్లకు ఏదైనా లీక్ అయితే చాలా బాధగా, కోపంగా ఉంటుంది. లోపల రగిలిపోతూ ఉంటుంది. అలాంటిది దాని గురించి జర్నలిస్టులు అడిగిన మాటలకు కోపం రావాల్సింది పోయి చాలా కూల్‍గా, నియంత్రణతో శైలేశ్ మాట్లాడారు” అని రాజమౌళి అన్నారు.
రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ గ్లోబల్ రేంజ్ భారీ బడ్జెట్ చిత్రం (ఎస్ఎస్ఎంబీ29) చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ సాగుతోంది. ఈ మూవీ షూటింగ్ సెట్స్ నుంచి ఇటీవల ఓ వీడియో లీకైంది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ తరుణంలో లీక్‍లు వస్తే తమకు లోపల రగిపోతుందని రాజమౌళి అనడం ఆసక్తికరంగా మారింది.
ఇంటరాగేషన్ అంటూ వేదికపై రాజమౌళిని కుర్చీలో కూర్చొబెట్టి ప్రశ్నలు అడిగారు యాంకర్ సుమ. ఈ క్రమంలో ఎస్ఎస్ఎంబీ29 గురించి ఏమైనా అప్‍డేట్ చెబుతారా అని అడిగారు. దీంతో సైలెంట్‍గా కుర్చీలో నుంచి లేచారు రాజమౌళి. ఆ కుర్చీలో సుమను కూర్చోబెట్టారు. ఎలాంటి అప్‍డేట్ ఇవ్వలేదు. ఎస్ఎస్ఎంబీ29పై మరోసారి మౌనం కంటిన్యూ చేశారు.
రాజమౌళికి మహాభారతం డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ ఇతిహాసాన్ని వెండితెరపైకి తీసుకొస్తానని గతంలోనూ చెప్పారు. మహాభారతం సినిమాలో నాని పాత్ర ఫిక్స్ అయిందని రూమర్ విన్నాం, ఇది నిజమేనా అని ఈ ఈవెంట్‍లో రాజమౌళిని సుమ అడిగారు. కచ్చితంగా నాని ఉంటాడనేది ఫిక్స్ అని రాజమౌళి చెప్పారు.
రాజమౌళికి స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది హిట్ 3 మూవీ టీమ్. వేదికపైకి ఒక చెక్క బాక్సును తీసుకొచ్చింది. దాన్ని లాఠీ కర్రతో కొట్టి బద్దలుకొట్టారు రాజమౌళి. దాంట్లో హిట్ 3 స్టైల్ సూట్ ఉంది. ఆ బాక్సును బద్దలుకొట్టి సూట్ వేసుకున్నారు రాజమౌళి. నాని, రాజమౌళి ఒకే స్టైల్ సూట్‍లో కనిపించారు. హిట్ 3 ట్రైలర్‌లో ఈ వైట్ సూట్ బాగా హైలైట్ అయింది.
హిట్ 3 సినిమాలో అర్జున్ సర్కార్ అనే సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రను నాని పోషించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‍గా చేశారు. మే 1న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ ఈ చిత్రం విడుదల కానుంది. నానినే ఈ మూవీని నిర్మించారు.
సంబంధిత కథనం