తను నమ్మిన సిద్ధాంతానికి ఇంచ్ కూడా పక్కకు జరగరు.. మేము పూర్తిగా అపోజిట్.. మరో దర్శకుడిపై రాజమౌళి కామెంట్స్-ss rajamouli praises director sekhar kammula in kubera pre release event and says he is stick to his principles ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  తను నమ్మిన సిద్ధాంతానికి ఇంచ్ కూడా పక్కకు జరగరు.. మేము పూర్తిగా అపోజిట్.. మరో దర్శకుడిపై రాజమౌళి కామెంట్స్

తను నమ్మిన సిద్ధాంతానికి ఇంచ్ కూడా పక్కకు జరగరు.. మేము పూర్తిగా అపోజిట్.. మరో దర్శకుడిపై రాజమౌళి కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మరో దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తారు. జూన్ 15న జరిగిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శేఖర్ కమ్ములపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శేఖర్ కమ్ముల నమ్మిన సిద్ధాంతాల గురించి, తనకన్న జూనియర్ అనుకున్న వ్యక్తి సీనియర్ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.

తను నమ్మిన సిద్ధాంతానికి ఇంచ్ కూడా పక్కకు జరగరు.. మేము పూర్తిగా అపోజిట్.. మరో దర్శకుడిపై రాజమౌళి కామెంట్స్

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, తమిళ అగ్ర హీరో ధనుష్ ముగ్గురు క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జూన్ 15న గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

ఏది అడ్డు వచ్చినా

కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. శేఖర్ కమ్ముల చాలా సాఫ్ట్‌గా హంబుల్‌గా ఉంటారు. ఆయనను చూసిన వెంటనే మనకి అలానే అనిపిస్తుంది. కానీ, ఆయన చాలా దృఢ నిశ్చయం కలిగిన మనిషి. తను నమ్మిన సిద్ధాంతానికి ఏది అడ్డు వచ్చినా ఒక్క ఇంచ్ కూడా పక్కకు జరగరు. ఆ క్వాలిటీని నేను చాలా ఎడ్మైర్ చేస్తాను" అని అన్నారు.

"శేఖర్ ఆయన నమ్మిన సిద్ధాంతాల మీద సినిమాలు తీస్తారు. నేను నమ్మిన సిద్ధాంతాలకి నేను చేసే సినిమాలకి సంబంధం ఉండదు. మేము కంప్లీట్ అపోజిట్ పోల్స్. ఆయన అంటే నాకు అపారమైన గౌరవం" అని మరో దర్శకుడిపై అని రాజమౌళి ప్రశంసలు కురిపించారు.

నాకంటే సీనియర్

"ఆయన (శేఖర్ కమ్ముల) ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు అయిందంటే నాకు నమ్మ బుద్ధి కావడం లేదు. ఆయన నాకు జూనియర్ అనుకున్నాను. కానీ, నాకంటే వన్ ఇయర్ సీనియర్ తను. ఈ 25 సంవత్సరాల్లో అలాగే ఉన్నాడు. తను నమ్మిన సిద్ధాంతాలతోనే సినిమాలు తీశాడు. ఆయన అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను" అని జక్కన్న చెప్పుకొచ్చాడు.

"నాగార్జున గారు, శేఖర్ కమ్ముల, టైటిల్ కుబేర.. ఈ అనౌన్స్‌మెంట్ వచ్చిన వెంటనే ఫెంటాస్టిక్‌గా అనిపించింది. ధనుష్ కూడా ఇందులో ఉన్నారని తెలిసిన తర్వాత అద్భుతమైన కాంబినేషన్ అనిపించింది. ట్రాన్స్ అఫ్ కుబేర రిలీజ్ అయిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది" అని దర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు.

సస్పెన్స్ సినిమాలాగా

"ఒక రిచ్ ప్రపంచంలో నాగార్జున గారు, పూర్ ప్రపంచంలో ధనుష్ గారు.. సినిమా కథ గురించి ఏం చెప్పకుండా ఈ రెండు క్యారెక్టర్స్‌ని చూపించడం చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. శేఖర్ కమ్ముల గారు తన సినిమాని ట్రైలర్‌లోనే చెప్పేస్తారు. కానీ, కుబేర విషయానికి వస్తే నాకు ఒక సస్పెన్స్ సినిమా లాగా అనిపిస్తుంది" అని రాజమౌళి తెలిపారు.

"నాగార్జున గారిని ధనుష్ గారిని ఎలా కలిపాడు? వాళ్ల మధ్య డ్రామా ఏంటి? అనేది చాలా క్యూరియాసిటీగా అనిపిస్తుంది. దీని కోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్నాను. కుబేర ట్రైలర్ ఆసక్తిని మరింత పెంచింది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్. ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంది. ప్రతీది టాప్ క్లాస్‌లో ఉన్నాయి. దేవి శ్రీ ఇచ్చిన నాది నాది సాంగ్, కుబేర థీమ్ ఇవన్నీ ఫెంటాస్టిక్‌గా ఉన్నాయి. జూన్ 20న డోంట్ మిస్ కుబేర" అని రాజమౌళి తన స్పీచ్ ముగించారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం