Srikanth Odela Marriage: ఓ ఇంటివాడైన దసరా డైరెక్టర్.. నాని షేర్ చేసిన ఫొటో చూశారా?
Srikanth Odela Marriage: ఓ ఇంటివాడయ్యాడు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఈ సందర్భంగా నాని వాళ్ల పెళ్లి ఫొటో షేర్ చేస్తూ కొత్త జంటను విష్ చేయాల్సిందిగా కోరాడు.
Srikanth Odela Marriage: తొలి సినిమా దసరాతోనే సూపర్ సక్సెస్ సాధించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఓ ఇంటివాడయ్యాడు. బుధవారం (మే 31) అతని పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా పెళ్లయిన జంట ఫొటోను నేచురల్ స్టార్ నాని ట్విటర్ లో పోస్ట్ చేశాడు. "మన శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు.. మీ అందరి ప్రేమ, దీవెనలు పంపించండి" అనే క్యాప్షన్ తో నాని ఈ ఫొటో షేర్ చేశాడు.
శ్రీకాంత్ ఓదెల పెళ్లి అతని సొంతూరైన గోదావరిఖనిలో జరిగింది. నిజానికి ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లిగానే చెబుతున్నా.. దాని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. శ్రీకాంత్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో కాదు.. అతని స్నేహితుల్లో ఒకరైన శివ అనే వ్యక్తి చెల్లెలే. ఆమెతో పరిచయం కూడా అనుకోకుండా జరిగిందే. శ్రీకాంత్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో తన రెమ్యునరేషన్ ను తన ఫ్రెండ్స్ అకౌంట్లలో వేసేవాడట.
అలా ఓరోజు తన ఫ్రెండ్స్ లో ఒకరు అతని స్నేహితుడైన శివ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని అడిగాడట. దానికి శ్రీకాంత్ స్పందిస్తూ.. శివకు అభ్యంతరం లేకపోతే తనకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని అన్నాడు. నిజానికి ఇద్దరి కులాలు వేరైనా కూడా.. స్నేహితులే వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడి ఈ పెళ్లికి ఒప్పించారు. చివరికి కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య గోదావరిఖనిలో శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు.
శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన తొలి సినిమా దసరానే. ఈ మూవీ రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకెళ్లింది. 2023లో టాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాల్లో ఒకటిగా ఈ దసరా నిలిచింది. నాని కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. ఈ మూవీకి ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది.
సంబంధిత కథనం
టాపిక్