Pedakapu Twitter Review: పెదకాపు 1 ట్విటర్ రివ్యూ.. సంతకం కాదు గునపం అంటూ!
Pedakapu Part 1 Movie Twitter Review: ఫ్యామిలీ చిత్రాలకు పేరొందిన దర్శకుల్లో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. అయితే ఆయన తాజాగా సాఫ్ట్ స్టోరీస్ పక్కన పెట్టి వయలెంట్ మూవీ పెదకాపు పార్ట్ 1 తెరకెక్కించారు. మరి పెదకాపు పార్ట్ 1 ట్విటర్ రివ్యూలోకి వెళితే..
కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మోత్సవం వంటి కుటుంబకథా చిత్రాలను అందించిన శ్రీకాంత్ అడ్డాల చాలా కాలం గ్యాప్ తర్వాత తెరకెక్కించిన సినిమా పెదకాపు పార్ట్ 1. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‍పై రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. అఖండ సినిమా నిర్మాత అయిన మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ హీరోగా పెదకాపు 1తో పరిచయం అయ్యాడు.
విలన్‍గా డైరెక్టర్
రూరల్ బ్యాక్ డ్రాప్‍తో తెరకెక్కిన పెదకాపు 1 సినిమాలో బ్రిగిడ సాగ హీరోయిన్‍గా చేసింది. ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, రాజీవ్ కనకాల, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా ఇందులో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల విలన్‍గా నటించడం విశేషం. ఇదిలా ఉంటే పెదకాపు 1 సినిమా సెప్టెంబర్ 29న విడుదల అయింది. ఇప్పటికీ ప్రీమియర్స్ వీక్షించిన ప్రేక్షకులు ట్విటర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.
జీరో ఎమోషన్
"కథలోకి వెళ్లేందుకు గంట పట్టింది. చెత్త రైటింగ్. అస్సలు బాలేదు. ఏం చెప్పాలనుకున్నారో అస్సలు క్లారిటీ లేదు. జీరో ఎమోషన్. సినిమా ఏమాత్రం బాలేదు. థియేటర్ నుంచి బయటకు వచ్చేద్దామనిపించింది. సామాన్యుడి సంతకం కాదు అద్దాల వారి గునపం. చెత్త సినిమాలన్నింటికే చెత్త సినిమా. ప్రమోషన్స్ చూసి మోసపోయా నేను. నాదే తప్పు" అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.
"పెదకాపు పార్ట్ 1 ఫస్టాఫ్ బ్యాడ్‌గా ఉంది. టీడీపీ వాళ్లకు గూస్‍బంప్స్ అని చెప్పి బిస్కట్ వేశాడు" అని మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు. "అద్దాల గాడికి పిచ్చి ఇంకా తగ్గలేదు. సాధ్యమైనంత వరకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి" అని మరొకరు అన్నారు.
"పెదకాపు మూవీ చాలా వికృతంగా ఉంది. ఒక్క సీన్ కూడా కరెక్ట్ గా సెట్ చేయలేదు. అస్సలు ఏమాంత్ర ఇంపాక్ట్ లేదు. ఈ సినిమా యావరేజ్ కంటే తక్కువగా ఉందని చెప్పుకొవచ్చు" అని ఒక యూజర్ తెలిపాడు.
పెదకాపు పార్ట్ 1 రస్టిక్ సెటప్‍తో చేసిన ఒక రూరల్ డ్రామా. కానీ, పేలవమైన స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడంతో వర్కౌట్ కాలేదు. సాంకేతిక విలువలు, కొందరి యాక్టింగ్ నిలబెట్టాయి. అయినా డ్రామాలో క్లారిటీ లేదు. కొన్ని చోట్ల విసుగు తెప్పిస్తుంది అని ఓ రివ్యూవర్ తెలిపాడు.