OTT Telugu Comedy Thriller: ఓటీటీలోకి నెల రోజుల్లోపే వస్తున్న తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ.. నవ్వడానికి రెడీగా ఉండండి-srikakulam sherlock holmes ott release date telugu comedy thriller to stream on etv win ott on 24th january ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Comedy Thriller: ఓటీటీలోకి నెల రోజుల్లోపే వస్తున్న తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ.. నవ్వడానికి రెడీగా ఉండండి

OTT Telugu Comedy Thriller: ఓటీటీలోకి నెల రోజుల్లోపే వస్తున్న తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ.. నవ్వడానికి రెడీగా ఉండండి

Hari Prasad S HT Telugu
Jan 22, 2025 05:52 PM IST

OTT Telugu Comedy Thriller: ఓటీటీలోకి ఓ తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ కు వస్తోంది. టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిశోర్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా చూస్తూ నవ్వడానికి ఇక సిద్ధంగా ఉండండి.

ఓటీటీలోకి నెల రోజుల్లోపే వస్తున్న తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ.. నవ్వడానికి రెడీగా ఉండండి
ఓటీటీలోకి నెల రోజుల్లోపే వస్తున్న తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ.. నవ్వడానికి రెడీగా ఉండండి

OTT Telugu Comedy Thriller: వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల నటించిన తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడీ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుండటం విశేషం. బుధవారం (జనవరి 22) ఈటీవీ విన్ ఓటీటీ ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది.

yearly horoscope entry point

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఓటీటీ రిలీజ్ డేట్

టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిశోర్ లీడ్ రోల్లో నటించిన మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. నవ్విస్తూనే థ్రిల్ పంచే ఈ సినిమా శుక్రవారం (జనవరి 24) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ బుధవారం (జనవరి 22) వెల్లడించింది.

"మిస్టరీని పరిష్కరించడానికి సిద్ధంగా ఉండండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఈటీవీ విన్ లో జనవరి 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ అంటూ ఈ మూవీ పోస్టర్ ను కూడా షేర్ చేసింది. తన కామెడీ టైమింగ్ తో నవ్వించడానికి వెన్నెల కిశోర్ రెడీగా ఉన్నాడు. మరి మీరు రెడీనా?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ స్టోరీ ఏంటంటే?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఓ కామెడీ థ్రిల్లర్ మూవీ. వైజాగ్ బీచ్ లో హత్యకు గురైన పులిదండు మేరీ అనే మహిళ, ఆ హత్యకు గల కారణాలేంటి అని ఇన్వెస్టిగేట్ చేసే ప్రైవేట్ డిటెక్టివ్ ఓం అలియాస్ షెర్లాక్ హోమ్స్ (వెన్నెల కిశోర్) చుట్టూ తిరిగే కథ ఇది. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురైన సమయంలోనే ఇక్కడ బీచ్ లో మేరీ హత్య జరుగుతుంది.

ఈ కేసును దర్యాప్తు చేసే సీఐ భాస్కర్ అటు రాజీవ్ గాంధీ కేసుకు మారడంతో ప్రైవేట్ డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. వారంలోపే ఈ కేసును పరిష్కరించాల్సిన పరిస్థితిలో అతడు తన దర్యాప్తు ఎలా చేస్తాడు? ఏడుగురు అనుమానితుల్లో నుంచి ఈ హత్యకు పాల్పడింది ఎవరన్నది ఎలా గుర్తిస్తాడు? అసలు ఓం.. షెర్లాక్ హోమ్స్ ఎలా అయ్యాడు అనేది తెలియాలంటే ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చూడాల్సిందే. ఈ సినిమాకు చంటబ్బాయ్ తాలూక అనే క్యాప్షన్ తో ఒకప్పుడు చిరంజీవి నటించిన మూవీని గుర్తుకు తెచ్చారు. అప్పట్లో ఆ సినిమా కూడా ఓ సెన్సేషన్. చిరు తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశాడు.

ఇక ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాను రైటర్ మోహన్ డైరెక్ట్ చేశాడు. డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఐఎండీబీలోనూ 5.3 రేటింగ్ మాత్రమే వచ్చింది. దీంతో నెల రోజుల్లోపే అంటే జనవరి 24 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం