Bigg Boss 6 Telugu Sri Satya Eliminated: శ్రీసత్య ఎలిమినేట్ - టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీళ్లే
Bigg Boss 6 Telugu Sri Satya Eliminated: బిగ్‌బాస్ హౌజ్ నుంచి శ్రీసత్య ఎలిమినేట్ అయ్యింది. మిడ్ వీక్ ఎలిమినేషన్స్‌లో ప్రేక్షకుల ఓట్లు శ్రీసత్యకు తక్కువగా రావడంతో ఆమె ఎలిమినేట్ అవుతున్నట్లుగా బిగ్‌బాస్ ప్రకటించాడు.
Bigg Boss 6 Telugu Sri Satya Eliminated: శ్రీసత్య బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. మిడ్ వీక్ ఎలిమినేషన్స్‌లో ఆమెను బిగ్‌బాస్ హౌజ్ నుంచి పంపించాడు. అంతకుముందు ఓట్ అప్పీల్ రేసులో ఉన్న కీర్తి, శ్రీహాన్‌కు వాల్ ఆఫ్ ఫార్ట్యూన్ అనే టాస్క్ ఇచ్చాడు. వాల్‌పై ఎవరు గెలవాలని అనుకుంటున్నారో వారి ఫొటోలు ఎక్కువగా పెట్టాలని మిగిలిన కంటెస్టెంట్స్‌ను కోరాడు. ఈ టాస్క్‌కు రేవంత్ సంచాలక్‌గా వ్యవహరిస్తూనే గేమ్‌లో పార్టిసిపేట్ చేశాడు. ఈ గేమ్‌లో కీర్తికి …రేవంత్ సపోర్ట్ చేశాడు. ఆమె ఫొటోలను మాత్రమే ఉపయోగించాడు. వాల్‌పై ఉన్న శ్రీహాన్ ఫొటోలను తీసేస్తూ కనిపించాడు. ఈ టాస్క్‌లో శ్రీహాన్ 35 ఫొటోలు, కీర్తి 29 ఫొటోస్ ఉన్నాయి. శ్రీహాన్‌కు ఆదిరెడ్డి సపోర్ట్ చేశాడు. అతడిపై కీర్తి సెటైర్స్ వేసింది. గుర్తుపెట్టుకుంటానని చెప్పింది.
ట్రెండింగ్ వార్తలు
శ్రీహాన్ ఎమోషనల్..
తనకు బిగ్‌బాస్‌లో కొన్ని రిగ్రెట్స్ ఉన్నాయని అన్నాడు శ్రీహాన్. తాను చేసే పనుల వల్ల హౌజ్‌లో కొందరు బాధపడ్డారని అన్నాడు. వారు బాధపడుతున్న విషయం తెలియగానే తాను రియలైజ్ అయ్యానని చెప్పాడు. పక్కన వాళ్లు వదిలిపెట్టడం వల్లే టికెట్ టూ ఫినాలే ట్రోఫీ వచ్చిందని అన్న మాటలు తనను బాధపెడుతున్నాయని ఎమోషనల్ అయ్యాడు. రేవంత్, శ్రీహాన్ మధ్య కోల్డ్ వార్ ఆసక్తికరంగా మారింది.
కీర్తి విన్నర్...
ఆదిరెడ్డి, రేవంత్, కీర్తిలకు ఓట్ అప్పిల్ కోసం హెడ్ బాల్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో కీర్తి విన్నర్‌గా నిలిచింది. సంచాలక్ శ్రీహాన్ నిర్ణయంతో రేవంత్ డిసపాయింట్ అయ్యాడు. బిగ్‌బాస్ విన్నర్ అయితే వచ్చే డబ్బును సామాజిక సేవ కోసం వినియోగిస్తానని కీర్తి పేర్కొన్నది.
మిడ్ వీక్ ఎలిమినేషన్...
ఆ తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్స్‌లో భాగంగా ఇంటి సభ్యులందరిని తమ లగేజీ ప్యాక్ చేసుకోమని బిగ్‌బాస్ ఆదేశించాడు. అందరూ తమ లగేజీని స్టోర్ రూమ్‌లో పెట్టారు. ఎవరు ఎలిమినేట్ కావాలని అనుకుంటున్నారో వారిని ఎగ్జిట్ ఫ్రేమ్ కింద నిల్చొమని చెప్పి రీజన్స్ వివరించాలని కంటెస్టెంట్స్‌ను కోరారు.
శ్రీహాన్‌తో టాస్క్ మొదలైంది. అతడు రోహిత్ పేరు చెప్పాడు. ఆ తర్వాత కీర్తి...ఆదిరెడ్డి పేరు చెప్పింది. ఆదిరెడ్డి మాట తీరు బాగా లేదని అన్నది. కీర్తి పేరును శ్రీసత్య చెప్పింది. రోహిత్...శ్రీహాన్ పేరును చెప్పి రివేంజ్ తీర్చుకున్నాడు. ఆ తర్వాత రేవంత్, ఆదిరెడ్డి ఇద్దరు కీర్తి పేరు చెప్పారు. కీర్తి పేరును ఎక్కువ మంది ప్రపోజ్ చేశారు. ఆమె హౌజ్ నుంచి వెళ్లిపోవడం ఖాయమని అనుకున్నారు.
శ్రీసత్య ఎలిమినేట్...
బిగ్‌బాస్ మాత్రం కీర్తిని సేవ్ చేసి శ్రీసత్య ఎలిమినేట్ అవుతున్నట్లుగా ప్రకటించాడు. ప్రేక్షకుల ఓటింగ్ ఆమెకు తక్కువగా వచ్చినట్లు తెలిపాడు. శ్రీసత్య ఎలిమినేట్ అవుతుండటంతో శ్రీహాన్, రేవంత్ ఎమోషనల్ అయ్యారు. తన కోపాన్ని అర్థం చేసుకున్న అమ్మాయి శ్రీసత్య అని రేవంత్ అన్నాడు. రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. టాప్ ఫైవ్‌లో ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్, రోహిత్‌తో పాటు కీర్తి నిలిచారు.