Sree Leela: ఉప్పెన హీరోతో రొమాన్స్ చేయ‌నున్న శ్రీలీల‌-sreeleela to romance with mega hero vaishnav tej ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sreeleela To Romance With Mega Hero Vaishnav Tej

Sree Leela: ఉప్పెన హీరోతో రొమాన్స్ చేయ‌నున్న శ్రీలీల‌

Nelki Naresh Kumar HT Telugu
Jun 14, 2022 02:17 PM IST

పెళ్లి సంద‌డి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల‌. ఈ సినిమా స‌క్సెస్ సాధించ‌క‌పోయినా శ్రీలీల అదృష్టాన్ని మాత్రం మార్చివేసింది. తెలుగులో వ‌రుస అవ‌కాశాల్ని సొంతం చేసుకుంటుంది ఈ సొగ‌స‌రి. తాజాగా ఆమె మెగా హీరోతో జోడీ క‌ట్ట‌బోతున్న‌ది...ఆ హీరో ఎవ‌రంటే...

శ్రీలీల
శ్రీలీల (instagram)

అదృష్టం అంటే శ్రీలీల‌దే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సొగ‌స‌రి చేసింది ఒకే ఒక సినిమా. అది కూడా యావ‌రేజ్ గానే నిలిచింది. కానీ అవ‌కాశాలు మాత్రం భారీగా సొంతం చేసుకుంటోంది శ్రీలీల‌. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందిన పెళ్లి సంద‌డి సినిమాలో గ్లామ‌ర్ తో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ల‌క్కీస్టార్ గా మారిపోయింది ఐదారు సినిమాల్లో న‌టిస్తోంది. ర‌వితేజ ధ‌మాకా, నితిన్-వ‌క్కంతం వంశీ ప్రాజెక్ట్‌, న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజుతో పాటు మ‌రికొన్ని చిత్రాలు చేస్తోంది.

తాజాగా ఈ సొగ‌స‌రి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ది. మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్ తో జోడీక‌ట్ట‌బోతున్న‌ది. ఉప్పెన‌, కొండ‌పొలం సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాడు వైష్ణ‌వ్‌తేజ్‌. అత‌డు హీరోగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సంస్థ‌లు ఓ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాయి. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీతో క‌లిసి ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రంలో వైష్ణ‌వ్‌తేజ్‌కు జోడీగా శ్రీలీల న‌టించ‌నున్న‌ది. ఈ విష‌యాన్ని మంగ‌ళ‌వారం చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. శ్రీలీల పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమెకు శుభాకాంక్ష‌లు చెబుతూ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకిరానుంది.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్