Sreeleela Item Songs: శ్రీలీలకి తలనొప్పిగా మారిన ‘కిస్సిక్’ ఐటెం సాంగ్.. ముద్దుగుమ్మ కఠిన నిర్ణయం
Pushpa 2 Kissik song: పుష్ప 2లోని కిస్సింగ్ ఐటెం సాంగ్ శ్రీలీలకి మంచి పేరు తీసుకొచ్చింది. కానీ.. ఈ పాట తర్వాత తనపై ఒక ముద్ర వేసేస్తారని ఈ ముద్దుగుమ్మ భయపడుతోంది. దాంతో..?
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీలకి ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ మూవీలో కిస్సిక్ అనే ఐటెం సాంగ్‌ను శ్రీలీల చేయగా.. ఈ పాట సూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో ఇప్పుడు ఈ అమ్మడికి వరుసగా ఐటెం సాంగ్స్ ఆఫర్స్ వస్తున్నాయట. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర నుంచి ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
నాలుగు డిజాస్టర్స్‌తో తగ్గిన ఆఫర్లు
వాస్తవానికి టాలీవుడ్‌లో గత ఏడాదన్నర వ్యవధిలో అత్యధిక సినిమాలు చేసిన హీరోయిన్‌ల జాబితాలో శ్రీలీల టాప్‌లో ఉంది. అయితే.. ఇందులో ఆమె నటించిన ఆఖరి సినిమాల్లో నాలుగు డిజాస్టర్స్ ఉండటంతో ఒక్కసారిగా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం శ్రీలీల రెండు సినిమాల్లో చేస్తుండగా.. ఆఖరిగా ఆమె నటించిన మూవీ ఈ ఏడాది సంక్రాంతి పండగ సమయంలో వచ్చిన గుంటూరు కారం. అయితే.. పుష్ప2 తర్వాత శ్రీలీల గ్రాఫ్ మళ్లీ ఒక్కసారిగా పెరిగినట్లు కనిపిస్తోంది.
డిసెంబరులో రాబిన్ హుడ్
అల్లు అర్జున్‌తో పోటీపడుతూ కిస్సిక్ అంటూ శ్రీలీల వేసిన స్టెప్స్ యూత్‌తో మళ్లీ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం ఈ అమ్మడు నితిన్‌తో కలిసి నటించిన రాబిన్ హుడ్ సినిమా డిసెంబరులోనే థియేటర్లలోకి రాబోతుండగా.. తమిళ్ హీరో శివకార్తికేయన్‌తో ఒక సినిమా చేయబోతోంది. ఇది వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.
ఐటెం గర్ల్ ముద్ర
కిస్సిక్ తర్వాత చాలా మంది ప్రొడ్యూసర్లు ఐటెం సాంగ్స్ కోసం ఈ అమ్మడిని సంప్రదిస్తుండటంతో.. ఐటెం గర్ల్ ముద్ర వేసేస్తారేమో అనే భయం శ్రీలీలలో మొదలైందట. దాంతో.. ఇకపై ఐటెం సాంగ్స్ చేయకూడదని శ్రీలీల నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2లో కిస్సిక్ సాంగ్ కోసం వారం రోజులు డేట్స్ కేటాయించిన శ్రీలీల.. రూ.2 కోట్లు వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.