Sreeleela: శ్రీలీల ఫస్ట్ బాలీవుడ్ మూవీ టీజర్ వచ్చేసింది.. రొమాన్స్‌ డోస్ పెంచిన హీరోయిన్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..-sreeleela in romantic mode in bollywood debut movie first look teaser kartik aaryan romantic musical movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sreeleela: శ్రీలీల ఫస్ట్ బాలీవుడ్ మూవీ టీజర్ వచ్చేసింది.. రొమాన్స్‌ డోస్ పెంచిన హీరోయిన్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..

Sreeleela: శ్రీలీల ఫస్ట్ బాలీవుడ్ మూవీ టీజర్ వచ్చేసింది.. రొమాన్స్‌ డోస్ పెంచిన హీరోయిన్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 15, 2025 10:37 PM IST

Sreeleela: శ్రీలీల బాలీవుడ్‍లోకి అడుగుపెడుతున్నారు. కార్తీక్ ఆర్యన్‍తో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ నేడు వచ్చేసింది. రొమాంటిక్‍గా ఈ టీజర్ ఉంది. రిలీజ్ ఎప్పుడో కూడా తెలిసిపోయింది.

Sreeleela: శ్రీలీల ఫస్ట్ బాలీవుడ్ మూవీ టీజర్ వచ్చేసింది.. రొమాన్స్‌ డోస్ పెంచిన హీరోయిన్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..
Sreeleela: శ్రీలీల ఫస్ట్ బాలీవుడ్ మూవీ టీజర్ వచ్చేసింది.. రొమాన్స్‌ డోస్ పెంచిన హీరోయిన్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..

టాలీవుడ్‍లో శ్రీలీల ఫుల్ బిజీగా ఉంటున్నారు. వరుసగా చిత్రాలు చేస్తున్నారు. అందం, అభినయం, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లో అదరగొడుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‍కు చేరుకుంటున్నారు. ఇక బాలీవుడ్‍లోనూ తెలుగమ్మాయి శ్రీలీల అడుగుపెడుతున్నారు. హిందీ హీరో కార్తీక్ ఆర్యన్‍తో మూవీ చేస్తున్నారు. అనురాగ్ బసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల ఫస్ట్ బాలీవుడ్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ నేడు (ఫిబ్రవరి 15) వచ్చేసింది.

రొమాంటిక్‍గా టీజర్

కార్తీక్ ఆర్యన్, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ మ్యూజిక్, రొమాన్స్‌తో ఉంది. ఇద్దరూ ప్రేమికుల్లా నటిస్తున్నారు. ఎక్కువ గడ్డంతో కార్తీక్ ఆర్యన్ లుక్ రగెడ్‍గా ఉంది. ఈ చిత్రంలో సింగర్‌గా అతడు నటిస్తున్నారు. కార్తీక్ లవర్ పాత్రను శ్రీలీల చేస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.

ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ పాటతో మొదలైంది. కార్తీక్ ఆర్యన్ గిటార్ మోగిస్తూ స్టేజ్‍పై పాట పాడుతుంటారు. ఆ తర్వాత కార్తీక్, శ్రీలీల రొమాంటిక్ మూవ్‍మెంట్స్ ఉన్నాయి. ఇద్దరి మధ్య కెమెస్ట్రీ కుదిరింది. రొమాన్స్ డోస్ పెంచేశారు శ్రీలీల. ఈ మూవీలో లిప్‍లాక్ కూడా ఉంటుందని టీజర్ ఎండింగ్ చూస్తే అర్థమవుతోంది. మొత్తంగా బాలీవుడ్ మూవీ కోసం శ్రీలీల కాస్త గ్లామర్ డోస్ పెంచినట్టు అనిపిస్తోంది.

ఫస్ట్ లుక్ టీజర్లో ఉన్న పాట మెలోడీ ట్యూన్‍తో ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సాంగ్‍ను విశాల్ మిశ్రా పాడారు. సమీర్ అంజన్ లిరిక్స్ అందించారు. రొమాంటిక్ మ్యూజికల్ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ అనురాగ్ బసు.

దీపావళికి రిలీజ్

కార్తీక్ ఆర్యన్, శ్రీలీల కలిసి నటించిన ఈ చిత్రానికి మేకర్స్ ఇంకా టైటిల్ వెల్లడించలేదు. ఫస్ట్ లుక్ టీజర్లో మూవీ పేరు ప్రకటించలేదు. అయితే, ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఈ చిత్రం విడుదల కావడం ఖరారైంది.

బాలీవుడ్ పాపులర్ ఫ్రాంచైజీ ఆషికీలో మూడో భాగంగా ఈ మూవీ వస్తుందని ముందుగా రూమర్లు వచ్చాయి. అయితే, దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆషికీ 2 స్టైల్‍లో మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగానే ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్ పతాకంపై భూషణ్ కుమార్, కృషన్ కుమార్ నిర్మిస్తున్నారు.

బాలీవుడ్‍లో మరో చిత్రానికి కూడా శ్రీలీల ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్‍‍తో ఓ మూవీలో హీరోయిన్‍గా ఈ తెలుగమ్మాయి చేయనున్నారు. ముంబైలో లీల, ఇబ్రహీం కలిసిన వీడియో ఇటీవల బయటికి వచ్చింది.

తెలుగులో శ్రీలీల ప్రస్తుతం రవితేజతో ‘మాస్ జాతర’, నితిన్‍తో ‘రాబిన్‍హుడ్’ చిత్రాలు చేస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్ పుష్ప 2 మూవీలో కిసిక్ పాటలో అల్లు అర్జున్‍తో చిందేసి అదరగొట్టారు ఈ భామ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కూడా లీల లైనప్‍లో ఉంది. తమిళంలో శివకార్తికేయన్‍తోనూ ఓ మూవీకి ఆమె ఓకే చెప్పారు. 

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం