Sreeleela in Saree: చీరలో కళ్లు తిప్పుకోలేని అందంతో శ్రీలీల.. ఫొటోలు చూశారా?-sreeleela in blue saree looks stunning in her latest photoshoot shared by her in instagram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sreeleela In Saree: చీరలో కళ్లు తిప్పుకోలేని అందంతో శ్రీలీల.. ఫొటోలు చూశారా?

Sreeleela in Saree: చీరలో కళ్లు తిప్పుకోలేని అందంతో శ్రీలీల.. ఫొటోలు చూశారా?

Hari Prasad S HT Telugu

Sreeleela in Saree: శ్రీలీల బ్లూ కలర్ శారీలో స్టన్నింగ్ లుక్ లో కనిపిస్తోంది. ఈ ఫొటోలను ఆమె మంగళవారం (మార్చి 25) తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. చీరలో ఆమె అందం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

చీరలో కళ్లు తిప్పుకోలేని అందంతో శ్రీలీల.. ఫొటోలు చూశారా?

Sreeleela in Saree: టాలీవుడ్ నటి శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలు అదిరిపోయాయి. బ్లూ కలర్ శారీలో తన నడుము అందాలతో ఆమె మాయ చేస్తోంది. ఎలాంటి క్యాప్షన్ లేకుండా ఈ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేసింది.

శ్రీలీల చీర అందాలు

ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లలో బిజీగా ఉన్న హీరోయిన్ శ్రీలీల. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్‌హుడ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో ఆమె నితిన్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. మూవీ మార్చి 30న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా ఓ బ్లూ కలర్ శారీలో ఆమె చేసిన ఫొటోషూట్ అదిరిపోయింది. ఈ చీరలో శ్రీలీల అందం రెట్టింపైంది. తన నడుము ఒంపులు చూపిస్తూ ఆమె ఈ ఫొటోషూట్ చేసి అభిమానులతో షేర్ చేసుకుంది. కేవలం ఓ హార్ట్ ఎమోజీయే క్యాప్షన్ గా ఈ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

శ్రీలీల డేటింగ్

ఇక శ్రీలీల డేటింగ్ వార్తలు కొన్నాళ్లుగా చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ తో ఆమె రిలేషన్షిప్ లో ఉందన్న వార్తలు వస్తున్నాయి. హిందీలో అతనితో కలిసి ఆశిఖీ 3 మూవీలో శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ లోనే ఇద్దరూ దగ్గరైనట్లు సమాచారం.

ఆ తర్వాత కార్తీక్ ఆర్యన్ ఇంటికి కూడా ఓ ఈవెంట్ సందర్భంగా ఆమె వెళ్లడంతో ఈ పుకార్లకు మరింత ఊతమిచ్చింది. అంతేకాదు ఈ మధ్య ఓ ఈవెంట్లో తనకు కోడలిగా ఓ డాక్టర్ కావాలని కార్తీక్ ఆర్యన్ తల్లి అనడం కూడా విశేషం. శ్రీలీల కూడా ఓ డాక్టరే. ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసింది.

రాబిన్‌హుడ్ మూవీ గురించి..

రాబిన్‍హుడ్ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ - వెంకీ కాంబోలో గతంలో వచ్చిన భీష్మ భారీ హిట్ కొట్టింది. దీంతో వీరి కలయికలో వస్తున్న రాబిన్‍హుడ్‍పై చాలా హైప్ ఉంది. అందుకు తగ్గట్టే ఈ మూవీకి ఓటీటీ హక్కుల రూపంలో జీ5 నుంచి మంచి ధరే దక్కినట్టు తెలుస్తోంది.

రాబిన్‍హుడ్ చిత్రంలో నితిన్‍కు సరసన హీరోయిన్‍గా నటించారు శ్రీలీల. ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, షైన్ టామ్ చాకో, దేవ్‍దత్ నాగే, శుభలేఖ సుధాకర్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ చేశారు. దీంతో మరింత క్రేజ్ నెలకొంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు కూడా వార్నర్ హాజరయ్యారు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం