Sree Vishnu Upcoming Movies: వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. డిఫరెంట్ కామెడీ టైమింగ్‌తో విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నాడు. ఎవరికి అర్థం కాని డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంటాడు.
సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ సినిమాలతో వరుసగా ఎంటర్‌టైన్ చేశాడు. ఇప్పుడు ఏకంగా నాలుగు అప్ కమింగ్ సినిమాలతో బీజీగా ఉన్నాడు శ్రీ విష్ణు. ఇప్పటివరకు కామెడీ, లవ్ స్టోరీ చిత్రాలతో అలరించిన శ్రీ విష్ణు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాతో శ్రీ విష్ణు ప్రేక్షకులను అలరించనున్నాడు.
డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోన్న కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో ఆకట్టుకోనున్నాడు. ఆ సినిమానే మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతోపాటు మరో మూడు సినిమాలను వరుసగా లైన్‌లో పెట్టాడు శ్రీవిష్ణు.
సింగిల్ అనే మరో రొమాంటిక్ కామెడీ చిత్రం చేస్తున్నాడు శ్రీవిష్ణు. దీనికి కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. సింగిల్ మూవీ మే 14న విడుదల కానుంది. అలాగే, మారుతిరావుతో కామెడీ ఎంటర్‌టైనర్‌గా మరో సినిమా చేస్తున్నాడు శ్రీ విష్ణు. ఈ మూడింటితోపాటు నాలుగో సినిమాను కూడా ఎంటర్‌టైనర్‌గా చేయనున్నాడు. దీనిని జానకిరామ్ తెరకెక్కిస్తున్నాడు.
ఇదిలా ఉంటే, మృత్యుంజయ్ సినిమాను రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు. ఇందులో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇదివరకు శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జోడీగా సామజవరగమన సినిమా వచ్చిన విషయం తెలిసిందే.
ఇక శుక్రవారం (ఫిబ్రవరి 28) నాడు శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా మృత్యంజయ్ టైటిల్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మృత్యుంజయ్ టైటిల్ టీజర్‌ను గమనిస్తే వాయిస్ ఓవర్‌లో "గేమ్ ఓవర్ జయ్" అని వినిపిస్తోంది. శ్రీవిష్ణు ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన ఫ్లాష్ కట్స్‌ను చూడొచ్చు. చాలా ఫాస్ట్‌గా చూపించిన ఈ గ్లింప్స్‌లో చిత్రంలోని నటీనటులతో పాటు శ్రీవిష్ణుని ఇన్వెస్టిగేటర్‌గా, ఖైదీగా చూడొచ్చు.
టీజర్ చివరిలో ‘నేను చెప్పే వరకు గేమ్ ఫినిష్ కాదు’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ హైలెట్‌గా ఉంది. ఈ టైటిల్ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తూ ‘మృత్యుంజయ్’ అని సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. అయితే, మృత్యుంజయ్ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
శ్రీవిష్ణు హీరోగా నటిస్తోన్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మరో ఇంట్రెస్టింగ్ ఎంటర్‌టైనర్‌గా మెప్పించనుందని తెలుస్తోంది. విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
సంబంధిత కథనం