Sree Vishnu: వివాహ భోజనంబు దర్శకుడితో శ్రీవిష్ణు సినిమా
Sree Vishnu: కెరీర్‌లో ఎక్కువగా కొత్త దర్శకులతోనే సినిమాలు చేశారు శ్రీవిష్ణు. తాజాగా అతడు మరో కొత్త దర్శకుడిని వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. అతడు ఎవరంటే...

Sree Vishnu: అల్లూరి సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చాడు శ్రీవిష్ణు. పోలీస్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈసినిమా మాస్ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటున్నది. ఈ సక్సెస్ జోష్‌లో కొత్త సినిమాను మొదలుపెట్టాడు శ్రీవిష్ణు. అతడు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న నూతన చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది.
హాస్యనటుడు సత్య హీరోగా సందీప్ కిషన్ నిర్మించిన వివాహ భోజనంబు సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. డైరెక్ట్‌గా ఓటీటీలో ఆ సినిమా రిలీజ్ అయ్యింది. తాజాగా శ్రీవిష్ణు సినిమాతో డైరెక్టర్ గా సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం కాబోతున్నాడు రామ్ అబ్బరాజు . ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఇందులో శ్రీవిష్ణు క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని పేర్కొన్నారు. అనిల్ సుంకరతో కలిసి రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. హీరోయిన్‌ను ఫైనలైజ్ చేసి త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో నారా రోహిత్,వీఐ ఆనంద్, విజయ్ కనకమేడల తదితరులు పాల్గొన్నారు.