తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ‘సింగిల్’ కలెక్షన్లలో అదరగొడుతోంది. శ్రీవిష్ణు హీరోగా, కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 9న థియేటర్లలో విడుదలైంది. ఆరంభం నుంచి పాజిటివ్ టాక్‍తో ఈ మూవీ వసూళ్లలో దుమ్మురేపుతోంది. ఇప్పటికే రూ.25కోట్ల కలెక్షన్లకు చేరువైంది. ప్రస్తుతం సెకండ్ వీకెండ్‍లోనూ మంచి వసూళ్లను నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఈ తరుణంలో సింగిల్ సినిమా ఓటిటీ రిలీజ్‍పై రూమర్లు వస్తున్నాయి.
సింగిల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని జూన్ 6వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురానుందని అంచనాలు బయటికి వస్తున్నాయి.
థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్‍కు తెచ్చేలా ఈ సినిమా మేకర్లతో ఆ ప్లాట్‍ఫామ్ డీల్ చేసుకుందని సమాచారం. దాని ప్రకారం జూన్ 6న సింగిల్ మూవీని స్ట్రీమింగ్‍కు తెచ్చేందుకుఅమెజాన్ ప్రైమ్ వీడియో నిర్ణయించుకుందని సమాచారం. అయితే, డేట్‍పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
సింగిల్ సినిమా థియేట్రికల్ రన్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.25కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లకు చేరువవుతోంది. వీక్‍డేస్‍లోనూ స్టడీగా వసూళ్లను రాబట్టింది. ఈ మూవీకి సెకెండ్ వీకెండ్ అయిన నేడు శనివారం మంచి బుకింగ్స్ జరిగాయి. కలెక్షన్లలో మరింత పెరుగుదల కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సండే కూడా ఇదే దూకుడు కంటిన్యూ కావొచ్చు. రూ.15కోట్ల గ్రాస్ టార్గెట్‍తో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే మంచి ప్రాఫిట్స్ సాధించింది.
సింగిల్ చిత్రం ట్రయాంగిల్ లవ్, కామెడీతో ఎంటర్‌టైనింగ్‍గా ఉంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ మూవీకి తమిళ డైరెక్టర్ కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో శ్రీవిష్ణు, కేతిక, ఇవానా మధ్య ట్రాయాంగిల్ లవ్ ట్రాక్ ఉంటుంది. వెన్నెల కిశోర్ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర చేశారు. శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్ మధ్య కామెడీ ట్రాక్‍లు, వారి టైమింగ్ అదిరిపోయాయి.
సింగిల్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, కాల్య ఫిల్మ్స్ పతాకాలపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రంలో వీటీ గణేశ్, సత్య, రాజేంద్ర ప్రసాద్, రెబా మోనికా జాన్, మానస కీలకపాత్రల్లో కనిపించారు. వెల్‍రాజ్ సినిమాటోగ్రఫీ చేశారు.
సంబంధిత కథనం