Sree Leela in RAPO20: అఫీషియల్‌.. రామ్‌, బోయపాటి సినిమాలో శ్రీలీల-sree leela in rapo20 as makers make it official ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sree Leela In Rapo20 As Makers Make It Official

Sree Leela in RAPO20: అఫీషియల్‌.. రామ్‌, బోయపాటి సినిమాలో శ్రీలీల

HT Telugu Desk HT Telugu
Oct 05, 2022 01:40 PM IST

Sree Leela in RAPO20: రామ్‌, బోయపాటి సినిమాలో శ్రీలీల ఛాన్స్‌ కొట్టేసింది. ఈ విషయాన్ని దసరా నాడు (అక్టోబర్‌ 5) మేకర్స్‌ అధికారికంగా అనౌన్స్‌ చేశారు.

నటి శ్రీలీల
నటి శ్రీలీల

Sree Leela in RAPO20: టాలీవుడ్‌లో యంగ్‌ అండ్‌ డైనమిక్‌ హీరో రామ్‌ పోతినేని. ఈ ఎనర్జటిక్‌ హీరో ఈ మధ్యే ది వారియర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది. అయితే అతని నెక్ట్స్‌ మూవీ మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీనుతో అని తెలియడంతో ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఈ ఇద్దరి కాంబినేషన్‌ పక్కాగా సూపర్‌ హిట్‌ అని ఇప్పటి నుంచే అంచనా వేసేస్తున్నారు. అయితే తాజాగా దసరా రోజు ఈ మూవీ మేకర్స్‌ నుంచి మరో పెద్ద అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో రామ్‌ సరసన శ్రీలీల ఛాన్స్‌ కొట్టేసినట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. ఈ ఇద్దరి మధ్య స్క్రీన్‌పై కెమెస్ట్రీ అదిరిపోతుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

ఈ మూవీ నుంచి ఇదొక్కటే కాదు మరో అప్‌డేట్‌ కూడా మేకర్స్‌ ఇచ్చారు. రామ్‌ పోతినేని 20వ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ అందించనున్నాడు. ఈ మధ్య టాలీవుడ్‌లో వస్తున్న ప్రతి పెద్ద సినిమా ఛాన్స్‌ అందుకుంటున్న తమన్‌.. ఈ బోయపాటి, రామ్‌ పోతినేని మూవీకీ మ్యూజిక్‌ అందించనున్నాడు.

ఇక ఈ సినిమా షూటింగ్‌ గురువారం (అక్టోబర్‌ 6) నుంచే ప్రారంభం కానున్నట్లూ మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో RAPO20 రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుందని చెప్పారు. శ్రీనివాస చిత్తూరి ఈ మూవీకి ప్రొడ్యూసర్‌గా ఉన్నాడు. ఈ సినిమాకు టైటిల్‌ ఇంకా పెట్టలేదు.

అందాల నటి శ్రీలీల ఇప్పటికే తెలుగులో పెళ్లి సందడి, దమాకాలాంటి మూవీల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు మూవీలోనూ నటించింది. ఈ సినిమా అక్టోబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 2019లో కిస్‌ అనే కన్నడ మూవీతో సినిమాల్లోకి వచ్చిన శ్రీలీల.. తక్కువ సినిమాలతోనే మంచి పేరు సంపాదించుకుంది.

IPL_Entry_Point

టాపిక్