Sravanthi Ravikishore first Tamil film: దిగ్గజ నిర్మాత కోలీవుడ్ ఎంట్రీ.. మొదటి చిత్రానికే స్టాండింగ్ ఓవేషన్-sravanthi ravikishore first tamil film kida gets standing ovation at indian panorama ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sravanthi Ravikishore First Tamil Film Kida Gets Standing Ovation At Indian Panorama

Sravanthi Ravikishore first Tamil film: దిగ్గజ నిర్మాత కోలీవుడ్ ఎంట్రీ.. మొదటి చిత్రానికే స్టాండింగ్ ఓవేషన్

Maragani Govardhan HT Telugu
Nov 23, 2022 07:47 PM IST

Sravanthi Ravikishore first Tamil film: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నిర్మించిన తొలి తమిళ చిత్రం కీడ అరుదైన గౌరవం దక్కించుకుంది. గోవా ఫిల్మ్ పెస్టివల్‌లో భాగంగా ఇండియన్ పనోరమాలో ప్రదర్శితమైన ఈ చిత్రానికి స్టాండింగ్ ఓవేషన్ లభించింది.

స్రవంతి రవికిషోర్ నిర్మించిన కీడ చిత్రానికి స్టాండింగ్ ఓవేషన్
స్రవంతి రవికిషోర్ నిర్మించిన కీడ చిత్రానికి స్టాండింగ్ ఓవేషన్

Sravanthi Ravikishore first Tamil film: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ నిర్మించిన చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. ఆయన రూపొందించిన తొలి తమిళ చిత్రం కీడ. ఈ సినిమా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI)లో ప్రదర్శితమైంది. ఇండియన్ పనోరమాలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అయితే అనంతరం ఈ సినిమాకు స్టాండింగ్ ఓవేషన్ లభించింది. స్రవంతి రవి కిశోర్ నిర్మించిన కిడ చిత్రానికి ఈ గౌరవం లభించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

“నేను చెన్నై వెళ్లినప్పుడు ఓ స్నేహితుడిని కలిశాను. ఆయన తనొక కథ విన్నానని, అద్భఉతంగా ఉందని చెప్పారు. కథ ఏంటని అడుగ్గా.. ఐదు నిమిషాల పాటు వివరించారు. నేను వెంటనే కనెక్ట్ అయ్యాను. స్క్రిప్టుతో పాటు డైరెక్టర్ నెరేషన్ వాయిస్ పంపించమని అడిగా. అనంతరం కథ మొత్తం విన్నాను. వెంటనే ఓకే చెప్పాను. దర్శకుడికి ఇదే తొలి చిత్రమైనా.. కథకు అతడే బాగా న్యాయం చేయగలడని అనిపించి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. అతడు స్క్రిప్టు ఎలాగైతే రాశాడో.. అలాగే తెరెకెక్కించాడు. అందుకే ఇప్పుడు అన్ని ప్రశంసలు వస్తున్నాయి. మా సంస్థలో తెరకెక్కిన తొలి తమిళ చిత్రమిదే. సినిమాకు భాషాపరమైన హద్దుల్లేవు. అందుకనే తమిళంలో తీశాం. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం” అని స్రవంతి రవికిశోర్ అన్నారు.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆర్ఏ వెంకట్ మాట్లాడుతూ.. “మా చిత్రానికి ఇంత అరుదైన గౌరవం లభించడం ఆనందంగా ఉంది. మధురైకు సమీపంలోనే ఉండే గ్రామం నేపథ్యంలో తీశాం. తాతయ్య, మనవడు, ఓ మేకపిల్ల ఇందులో ముఖ్య పాత్రలు పోషించాయి. పనోరమాలో ఈ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు నాతో పాటు చాలా మంది విద్యార్థులు చూశారు. వారు ప్రతి సీన్ గురించి చెబుతుంటే ఎంతో ఆనందమేసింది. నా బాల్యంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో తీశాను. ఈ రోజు ఈ సినిమా ఈ స్థాయికి వచ్చిందంటే అందుకు స్రవంతి రవికిశోర్ గారే కారణం. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అందుకు ఆయనకు చాలా థ్యాంక్స్” అని అన్నారు.

కీడ చిత్రంలో పూ రామన్, కాళీ వెంకట్ తదితరుల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో దాదాపు అందరు కొత్త నటీ, నటులే నటించారు. దర్శకుడితో పాటు సంగీత దర్శకుడికి కూడా ఇదే కొత్త చిత్రం.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్