Squid Game 3 OTT Streaming: అఫీషియల్.. స్క్విడ్ గేమ్ 3 స్ట్రీమింగ్ డేట్ ఇదే.. అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్-squid game season 3 to stream on netflix from 27th june 2025 prepare for the final game ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Squid Game 3 Ott Streaming: అఫీషియల్.. స్క్విడ్ గేమ్ 3 స్ట్రీమింగ్ డేట్ ఇదే.. అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్

Squid Game 3 OTT Streaming: అఫీషియల్.. స్క్విడ్ గేమ్ 3 స్ట్రీమింగ్ డేట్ ఇదే.. అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్

Hari Prasad S HT Telugu
Jan 30, 2025 08:37 PM IST

Squid Game 3 OTT Streaming: కొరియన్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ చివరిదైన మూడో సీజన్ కు సిద్ధమైంది. ఈ వెబ్ సిరీస్ మూడో సీజన్ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ గురువారం (జనవరి 30) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

అఫీషియల్.. స్క్విడ్ గేమ్ 3 స్ట్రీమింగ్ డేట్ ఇదే.. అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్
అఫీషియల్.. స్క్విడ్ గేమ్ 3 స్ట్రీమింగ్ డేట్ ఇదే.. అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్

Squid Game 3 OTT Streaming: స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఈ ఏడాదే ఓటీటీలోకి వస్తోంది. ఈ సూపర్ హిట్ వెబ్ సిరీస్ మూడో సీజన్ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. జూన్ 27 నుంచి కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. రెండో సీజన్ లాగా కాకుండా చాలా త్వరగానే ఈ మూడో సీజన్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం విశేషం.

yearly horoscope entry point

స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఓటీటీ స్ట్రీమింగ్

కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 గతేడాది డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలుసు కదా. తొలి సీజన్ వచ్చిన మూడేళ్ల తర్వాతగానీ ఈ రెండో సీజన్ రాలేదు.

కానీ మూడో సీజన్ కోసం మాత్రం అన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు. రెండో సీజన్ వచ్చిన సరిగ్గా ఏడు నెలల తర్వాత అంటే ఈ ఏడాది జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. "ఫైనల్ రౌండ్ కోసం ప్రెస్ చేయండి. స్క్విడ్ గేమ్ సీజన్ 3 జూన్ 27న చూడండి" అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది.

ఫైనల్ గేమ్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ ఓ పోస్టర్ ను కూడా పోస్ట్ చేసింది. ఆ తర్వాత మరో ట్వీట్ కూడా చేసింది. "స్క్విడ్ గేమ్ 3 కోసం మిమ్మల్ని ఏదీ సిద్ధం చేయలేదు. స్క్విడ్ గేమ్ సీజన్ 3ని జూన్ 27న చూడండి" అనే క్యాప్షన్ తో మరికొన్ని ఫొటోలను పోస్ట్ చేయడం విశేషం.

స్క్విడ్ గేమ్ సీజన్ 2లో ఏం జరిగిందంటే?

కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ 2021లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకూ నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్ గా చరిత్ర సృష్టించింది.

ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య రెండో సీజన్ గతేడాది డిసెంబర్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి సీజన్ లాగా రెండో సీజన్ అంతగా థ్రిల్ పంచలేకపోయింది. అయినా కూడా నెట్‌ఫ్లిక్స్ అందుబాటులో ఉన్న ప్రతి దేశంలోనూ ఈ వెబ్ సిరీస్ టాప్ లో నిలవడం విశేషం.

క్రైమ్ ఎలిమెంట్స్‌తోపాటు స‌మాజంలోని ధ‌నిక, పేద అంత‌రాల‌ను, పెట్టుబ‌డిదారీ వ్య‌వ‌స్థ ఆధిప‌త్యాన్ని ఈ సిరీస్‌లో చూపించాడు డైరెక్ట‌ర్ హ్యాంగ్ డాంగ్ హ్యూక్. సీజ‌న్ వ‌న్‌కు మించి అంచ‌నాల‌తో స్క్విడ్ గేమ్ సీజ‌న్ 2 ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సీజ‌న్ లో లీ జాంగ్ జీ, వీ హా జూన్‌, ఇమ్సి వాన్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

స్క్విడ్ గేమ్‌ సీజ‌న్ 2 కూడా ఇంచుమించు ఇదే క‌థ‌తో సాగుతుంది. స్క్విడ్‌గేమ్‌ను ఆడించేవారిని వారిని ప‌ట్టుకొని ఈ డెత్‌గేమ్‌కు పుల్‌స్టాప్ పెట్టాల‌ని సియాంగ్ జీ అనుకుంటాడు. త‌న రివేంజ్ కోసం ఈ ప్ర‌మాద‌క‌ర‌మైన గేమ్‌లోకి ఎంట‌ర్ అవుతాడు. అక్క‌డ అత‌డికి ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయి? స్వ్కిడ్‌గేమ్‌కు ఎండ్ చేయాల‌నే అత‌డి ప్ర‌య‌త్నం నెర‌వేరిందా? అస‌లు ఈ గేమ్ వెనుక ఉన్న‌ది ఎవ‌రు అన్న‌దే సీజ‌న్ 2 క‌థ‌.

Whats_app_banner

సంబంధిత కథనం