స్క్విడ్ గేమ్ సీజన్ 3 వచ్చేస్తోంది.. ఇంట్రెస్టింగ్‍గా టీజర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. మరింత డెడ్లీగా!-squid game season 3 release date confirmed netflix ott teaser released squid game 3 thriller series streaming details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  స్క్విడ్ గేమ్ సీజన్ 3 వచ్చేస్తోంది.. ఇంట్రెస్టింగ్‍గా టీజర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. మరింత డెడ్లీగా!

స్క్విడ్ గేమ్ సీజన్ 3 వచ్చేస్తోంది.. ఇంట్రెస్టింగ్‍గా టీజర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. మరింత డెడ్లీగా!

స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‍లో మూడో సీజన్ కూడా రెడీ అయింది. నేడు టీజర్ వచ్చేసింది. ఇంటెన్సిటీతో సాగింది. స్క్విడ్ గేమ్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది.

స్క్విడ్ గేమ్ సీజన్ 3 వచ్చేస్తోంది.. ఇంట్రెస్టింగ్‍గా టీజర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. మరింత డెడ్లీగా!

స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ వరల్డ్ వైడ్ చాలా పాపులర్. ఇండియాలోనూ ఈ సిరీస్‍కు చాలా ఆదరణ దక్కింది. ఇప్పటి వరకు వచ్చిన రెండు సీజన్లు భారీ సక్సెస్ అయ్యాయి. 2021లో వచ్చిన తొలి సీజన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మూడేళ్ల తర్వాత గతేడాది డిసెంబర్‌లో రెండో సీజన్ వచ్చింది. ఇప్పుడు స్క్విడ్ గేమ్ మూడో సీజన్ అప్పుడే రెడీ అయింది. నేడు (మే 6) సీజన్ 3 టీజర్ వచ్చేసింది. స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

టీజర్ ఇలా..

స్క్విడ్ గేమ్ 2 ముగిసిన దగ్గరి నుంచే ఈ మూడో సీజన్ షురూ కానుంది. పింక్ డ్రెస్ వేసుకున్న గార్డులు ఓ శవపేటికను మోసుకురావటంతో స్క్విడ్ గేమ్ 3 టీజర్ మొదలైంది. అక్కడ ఉన్న ప్లేయర్లలో భయం చూసేందుకు వారు ఇలా శవ పేటికను తీసుకొస్తారు. ఇతర ప్లేయర్లు దగ్గరికి వచ్చి చూస్తారు. కానీ ఆ శవపేటికలో వారు ఊహించని విధంగా షియాంగ్ జీ హున్ (లీ జంగ్ జీ) ఉంటాడు. కళ్లు తెరుస్తాడు ఇది పెద్ద ట్విస్టుగా ఉంటుంది.

ప్రైజ్‍మనీ కోసం మిగిలిన కంటెస్టెంట్లు ఈ డెడ్లీ గేమ్‍లో పోటీ పోటీ పడడం మళ్లీ మొదలవుతుంది. ఈ గేమ్ నిర్వాహకుల గుట్టు రట్టు చేసేందుకు షియాంగ్ ప్రయత్నిస్తుంటాడు. వన్ లాస్ట్ టైమ్ అని ఈ టీజర్లో ఉంది. ఈ సీజన్ మరింత డెడ్లీగా, వైలెంట్‍‍గా ఉంటుందని అర్థమవుతోంది. ఓ శిశువు ఏడుపు శబ్దంతో స్క్విడ్ గేమ్ సీజన్ 3 టీజర్ ముగిసింది. స్క్విడ్ గేమ్‍లో ఇది ఆఖరి సీజన్ అనే హింట్ కూడా వచ్చేసింది.

స్క్విడ్ గేమ్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్.. తెలుగులోనూ..

స్క్విడ్ గేమ్ సీజన్ 3.. ఈ ఏడాది జూన్ 27వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇంగ్లిష్‍తో పాటు తమిళం, తెలుగు, హిందీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుంది. డేట్‍ను కూడా అధికారికంగా ఖరారు చేసింది నెట్‍ఫ్లిక్స్.

మిగిలిన ప్లేయర్లతో..

రెండో సీజన్ ముగింపులో మిగిలిన ప్లేయర్లతో ఆటతో స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఉండనుంది. షియాంగ్ జీ హున్, డిటెక్టివ్ హువాంగ్ జున్ హో, జియో హో, హ్యున్ డూ, యంగ్ సీ మహా మరికొందరు ప్లేయర్లు ఉన్నారు. ఈ సీజన్ మరింత ఇంటెన్సీతో ఉండనుంది. “ఫైనల్ గేమ్స్ ఆడేందుకు సమయం వచ్చేసింది. జూన్ 27న స్క్విడ్ గేమ్ సీజన్ 3” అని సోషల్ మీడియాలో నెట్‍ఫ్లిక్స్ పోస్ట్ చేసింది.

స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‍కు క్రియేటర్, డైరెక్టర్‌గా హ్యాంగ్ డాంగ్ హ్యుక్ ఉన్నారు. లీ జంగ్ జీ, పార్క్ హీ సూ, వీ హా జూన్, జంగ్ హూ యెవోన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం