OTT Spy Action Thriller Web Series: ఇండియన్ ఓటీటీలోకి వచ్చిన అద్భుతమైన వెబ్ సిరీస్ లలో ఒకటి ది ఫ్యామిలీ మ్యాన్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి 2019లో తొలి సీజన్ తో అడుగుపెట్టిన ఈ సిరీస్.. ఇప్పటికే రెండో సీజన్లు పూర్తి చేసుకుంది. మూడో సీజన్ కోసం కొన్నేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాదే ఆ కొత్త సీజన్ రాబోతోంది.
ది ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ స్ట్రీమింగ్ పై ఇందులో లీడ్ రోల్ పోషించిన మనోజ్ బాజ్‌పాయీ అప్డేట్ ఇచ్చాడు. ఈ మధ్య జరిగిన ఓటీటీప్లే అవార్డుల కార్యక్రమంలో అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ ఏడాది నవంబర్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఈ సిరీస్ మూడో సీజన్ రానున్నట్లు అతడు తెలిపాడు. ఈ సిరీస్ లో అతడు శ్రీకాంత్ తివారీ అనే స్పై పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
కొత్త సీజన్ గురించి ప్రశ్నించిన సమయంలో మనోజ్ స్పందించాడు. “ఇప్పటికే బయటకు తెలిసిన విషయమే ఇది. కానీ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఈ ఏడాది నవంబర్ లో రిలీజ్ కానుంది. ఈ షోలో కొత్త పాత్ర వస్తోందని మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. రెండేళ్ల కిందట జైదీప్ అహ్లావత్ ను తీసుకోవాలని నిర్ణయించాం. పాతాళ్ లోక్ సీజన్ 2లోనూ అద్భుతంగా నటించాడు. మా అదృష్టం కొద్దీ అతడు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో నటిస్తున్నాడు. ఈ కొత్త సీజన్ భారీ స్థాయిలో అద్భుతంగా ఉంటుంది” అని మనోజ్ స్పష్టం చేశాడు.
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2019లో వచ్చింది. కశ్మీర్ ఉగ్రవాదం బ్యాక్‌డ్రాప్ లో ఈ సిరీస్ రూపొందింది. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేశారు. తొలి సీజన్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తర్వాత రెండేళ్లకు అంటే జూన్ 4, 2021లో రెండో సీజన్ వచ్చింది. ఈసారి శ్రీలంక ఎల్టీటీఈ ఉగ్రవాదంపై సిరీస్ ను నడిపించారు.
శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ తిరిగి రాగా.. రెండో సీజన్లో సమంత నెగటివ్ రోల్ పోషించింది. తొలి సీజన్ అంత కాకపోయినా.. రెండో సీజన్ కు కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. సుమారు నాలుగేళ్లుగా మూడో సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తానికి నవంబర్ లో ఈ కొత్త సీజన్ రానుంది.
సంబంధిత కథనం