స్పై థ్రిల్లర్ సిరీస్ 'స్పెషల్ ఓపీఎస్' మరో సీజన్ కోసం తిరిగి వస్తోంది. దీని కోసం అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. స్పెషల్ ఓపీఎస్ 2 అనేది స్పెషల్ ఓపీఎస్ (2020), దాని స్పిన్-ఆఫ్ స్పెషల్ ఓపీఎస్ 1.5 (2021) కు సీక్వెల్. వెబ్ సిరీస్ రెండవ సీజన్ కోసం కే కే మీనన్ కఠినమైన గూఢచారి హిమ్మత్ సింగ్ పాత్రను తిరిగి పోషించడంతో పాటు ఈ సారి కథ సైబర్-టెర్రరిజం చుట్టూ తిరుగుతుంది.
జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానున్న స్పెషల్ ఓపీఎస్ రెండవ సీజన్ రిలీజ్ డేట్ కన్ఫామైంది. ఈ స్పై-థ్రిల్లర్ సిరీస్ జులై 11న విడుదల అవుతుంది. “ఈసారి, అందరూ టార్గెట్! సైబర్-టెర్రరిజం వర్సెస్ హిమ్మత్ సింగ్ అండ్ అతని బృందం” అని జియో హాట్‌స్టార్ ఓటీటీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
అదృష్టవశాత్తూ అభిమానులు స్పెషల్ ఓపీఎస్ అన్ని ఎపిసోడ్‌లను ఒకేసారి చూడగలుగుతారు. ఒక్కో ఎపిసోడ్ కోసం వారం వారం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మరొక పోస్ట్‌లో జియో హాట్‌స్టార్ వెబ్ సిరీస్ కోసం వేరే టీజర్‌ను పోస్ట్ చేసి.. “హిమ్మత్ ఎప్పుడూ (నాన్న) డ్యూటీకి దూరంగా ఉండడు!” అని పేర్కొంది.
స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 అధికారిక ట్రైలర్ ప్రకారం స్టోరీ సైబర్ యుద్ధం, ఏఐ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ లక్ష్యంగా ఉంటారు. హిమ్మత్ సింగ్ పాత్రలో మీనన్ వార్ రూమ్ నుండి తన బృందంతో సమన్వయం చేసుకోవడంతో ఇది ప్రారంభమవుతుంది. దీని తరువాత ఫరూక్ అలీ పాత్రలో నటించిన కరణ్ టాకర్ ఉగ్రవాదులను ఒంటరిగా ఓడించడం జరుగుతుంది. ప్రకాష్ రాజ్, తాహిర్ రాజ్ భాసిన్ కూడా ఈ గూఢచర్య థ్రిల్లర్‌లో భాగమయ్యారు.
స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2లో కే కే మీనన్, కరణ్ టాకర్, వినయ్ పాఠక్, తాహిర్ రాజ్ భాసిన్, దిలీప్ తాహిల్, ప్రకాష్ రాజ్, పర్మీత్ సేథీ, కాళీ ప్రసాద్ ముఖర్జీ, ముజమ్మిల్ ఇబ్రహీం, సయామి, ఆరిఫ్ జకారియా, గౌతమి కపూర్, కామాక్షి భట్, శిఖా, తల్సానియా రేవతి తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్ లో తాహిర్ రాజ్ భాసిన్ మెయిన్ విలన్ రోల్ ప్లే చేశాడు.
సంబంధిత కథనం