Spark of Dasara | ఊర మాస్‌ లుక్‌లో నాని.. దసరా ఫస్ట్‌లుక్ వచ్చేసింది-spark of dasara video from team dasara starring nani ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Spark Of Dasara Video From Team Dasara Starring Nani

Spark of Dasara | ఊర మాస్‌ లుక్‌లో నాని.. దసరా ఫస్ట్‌లుక్ వచ్చేసింది

HT Telugu Desk HT Telugu
Mar 20, 2022 12:46 PM IST

నేచురల్‌ స్టార్‌ నాని దసరా మూవీ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది. ఆదివారం ఉదయం 11.34 గంటలకు మూవీ యూనిట్‌ ఈ వీడియోను రిలీజ్‌ చేసింది.

దసరా మూవీలో నాని
దసరా మూవీలో నాని (Twitter)

ఇన్నాళ్లూ క్లాస్‌ లుక్‌లో నేచురల్‌ స్టార్‌గా అభిమానులను అలరించిన నాని ఇప్పుడు ఊర మాస్‌ లుక్‌లో వచ్చేస్తున్నాడు. తన లేటెస్ట్‌ మూవీ దసరాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను ఆదివారం రిలీజ్‌ చేశారు. శనివారమే దీనికి సంబంధించి నాని ఓ ట్వీట్‌ చేశాడు. ఆదివారం ఉదయం 11.34 గంటలకు సిద్ధంగా ఉండండి.. ఫస్ట్‌ లుక్కా? గ్లింప్సా? లేక రెండా అనేది చూడండి అంటూ తన మాస్‌ లుక్‌కు సంబంధించిన సగం ఫొటోను పోస్ట్‌ చేశాడు. చెప్పినట్లే ఆదివారం అదే సమయానికి దసరా ఫస్ట్ లుక్‌ వచ్చేసింది. ఇందులో నాని లుంగీ పైకి కట్టి, నడుముకు రెండు సారా బాటిల్స్‌ తగిలించుకొని, చేతిలో బీడీ పట్టుకొని ఊర మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. గనిలో పని చేస్తున్న కార్మికులకు నాయకుడిగా ఈ లుక్‌లో నాని కనిపిస్తున్నాడు.

శ్రీకాంత్ ఓదెల్ల దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో సాగనుంది. తొలిసారిగా నాని ఈ చిత్రం కోసం తెలంగాణ యాసలో మాట్లాడనున్నాడు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ చిత్రంలో సముద్ర ఖని, జరీనా వాహెబ్, సాయి కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

ఇది కాకుండా అంటే సుందరానికి.. అనే చిత్రం కూడా చేస్తున్నాడు నాని. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.