Most Remakes Movies: ఎక్కువసార్లు రీమేక్స్ అయిన టాప్ సౌత్ సినిమాలు ఇవే.. నంబర్ వన్ స్థానంలో మన తెలుగు సినిమానే..-south indian movies with most number of remakes 4 tamil and 3 telugu movies in top 10 trisha siddharth movie on top ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Most Remakes Movies: ఎక్కువసార్లు రీమేక్స్ అయిన టాప్ సౌత్ సినిమాలు ఇవే.. నంబర్ వన్ స్థానంలో మన తెలుగు సినిమానే..

Most Remakes Movies: ఎక్కువసార్లు రీమేక్స్ అయిన టాప్ సౌత్ సినిమాలు ఇవే.. నంబర్ వన్ స్థానంలో మన తెలుగు సినిమానే..

Hari Prasad S HT Telugu
Apr 19, 2024 06:06 PM IST

Most Remakes Movies: సినిమా ఇండస్ట్రీల్లో రీమేక్స్ అనేవి సాధారణమే. మరి సౌత్ ఇండియన్ సినిమాల్లో ఎక్కువసార్లు రీమేక్స్ అయిన సినిమా ఏది? టాప్ 10 లిస్టులో మాత్రం నాలుగు తమిళం, మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి.

ఎక్కువసార్లు రీమేక్స్ అయిన టాప్ సౌత్ సినిమాలు ఇవే.. నంబర్ వన్ స్థానంలో మన తెలుగు సినిమానే..
ఎక్కువసార్లు రీమేక్స్ అయిన టాప్ సౌత్ సినిమాలు ఇవే.. నంబర్ వన్ స్థానంలో మన తెలుగు సినిమానే..

Most Remakes Movies: ఏ సినిమా ఇండస్ట్రీ అయినా అన్నీ సొంత కథలతో సినిమాలు తీయాలంటే సాధ్యం కాదు. పక్క ఇండస్ట్రీల్లో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయడం అన్నది ఏ ఇండస్ట్రీలో అయినా సాధారణమే. అయితే చాలా వరకూ సినిమాలు ఒకటి రెండు భాషల్లో రీమేక్స్ తోనే సరిపెట్టుకుంటే కొన్ని సినిమాలు మాత్రం రెండు కంటే ఎక్కువ రీమేక్స్ సొంతం చేసుకున్నాయి. అలా సౌత్ ఇండియాలో ఎక్కువ రీమేక్స్ రికార్డు అందుకున్న టాప్ 10 సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

ఎక్కువ రీమేక్స్ జరిగిన సినిమాలు ఇవే

కాదల్ (తమిళం) - ఆరు రీమేక్స్

తమిళ సినిమా కాదల్ ను ఆరుసార్లు రీమేక్ చేశారు. తెలుగులో ప్రేమిస్తే పేరుతో ఈ మూవీ రిలీజైంది. ఆ తర్వాత కన్నడ, మరాఠీ, నేపాలీ, బెంగాలీ, పంజాబీ భాషల్లోనూ ఈ సినిమాను రీమేక్ చేయడం విశేషం.

తిరువిళైయాడల్ ఆరంభం (తమిళం)

ధనుష్, శ్రియ నటించిన ఈ తమిళ సినిమా కూడా ఆరుసార్లు రీమేక్ అయింది. 2006లో ఈ మూవీ రిలీజ్ కాగా.. మరుసటి ఏడాది టక్కరి పేరుతో తెలుగులో రీమేక్ అయింది. అంతేకాకుండా కన్నడ, బెంగాలీ, ఒడియా, బంగ్లాదేశీ బెంగాలీ, బర్మీస్ భాషల్లోనూ ఈ మూవీని రీమేక్ చేశారు.

నడువుల కొంజమ్ పక్కత కానోమ్ (తమిళం)

2012లో విజయ్ సేతుపతి నటించిన ఈ తమిళ సినిమా రిలీజైంది. ఆ తర్వాతి ఏడాది తెలుగులో పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ పేరుతో రీమేక్ అయింది. ఇక కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, గుజరాతీ భాషల్లోనూ ఈ సినిమాను రీమేక్ చేశారు.

బృందావనం (తెలుగు)

జూనియర్ ఎన్టీఆర్, కాజల్, సమంత నటించిన మూవీ బృందావనం. 2010లో ఈ సినిమా రిలీజైంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశాడు. తెలుగులో సక్సెస్ కావడంతో ఈ సినిమాను తర్వాత కన్నడ, బెంగాలీ, మరాఠీ, ఒడియా, భోజ్‌పురి, బంగ్లాదేశీ బెంగాలీ.. ఇలా మొత్తం ఆరుసార్లు రీమేక్ చేశారు.

పవిత్ర బంధం (తెలుగు)

వెంకటేశ్, సౌందర్య నటించిన మూవీ పవిత్ర బంధం. తెలుగులో పెద్ద హిట్ మూవీ ఇది. ఈ సినిమాను కూడా ఆరుసార్లు రీమేక్ చేశారు. కన్నడ, తమిళం, హిందీ, ఒడియా, బెంగాలీ, బంగ్లాదేశీ బెంగాలీ భాషల్లో రీమేక్ చేయడం విశేషం.

కిరీడం (మలయాళం)

మలయాళం యాక్షన్ డ్రామా మూవీ కిరీడం సినిమాను ఆరుసార్లు రీమేక్ చేశారు. మోహన్ లాల్ నటించిన ఈ సినిమాను తెలుగులో రౌడీయిజం నశించాలి పేరుతో రీమేక్ చేశారు. తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, బంగ్లాదేశీ బెంగాలీ భాషల్లోనూ రీమేక్ అయింది.

అనురాగ ఆరలిత్తు (కన్నడ)

కన్నడ మూవీ అనురాగ ఆరలిత్తు 1986లో రిలీజైంది. ఈ సినిమాను తెలుగులో చిరంజీవి ఘరానా మొగుడుగా రీమేక్ చేశాడు. ఆ తర్వాత తమిళం, హిందీ, బెంగాలీ, ఒడియా, బంగ్లాదేశీ బెంగాలీ భాషల్లోనూ రీమేక్ చేశారు.

ఛార్లీ చాప్లిన్ (తమిళం)

ప్రభు గణేషన్, ప్రభు దేవా నటించిన తమిళ మూవీ ఛార్లీ చాప్లిన్ మూవీని ఆరుసార్లు రీమేక్ చేశారు. తెలుగులో పెళ్లాం ఊరెళ్తే పేరుతో వచ్చింది. ఇక హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ రీమేక్ చేశారు.

దృశ్యం (మలయాళం)

మలయాళం సూపర్ హిట్ మూవీ దృశ్యం. ఈ సినిమాను ఆరుసార్లు రీమేక్ చేశారు. తెలుగులో ఇదే పేరుతో వెంకటేశ్ చేశాడు. హిందీ, తమిళం, కన్నడ, సింహళ, చైనీస్ భాషల్లో రీమేక్స్ చేశారు.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా (తెలుగు)

ఇక సౌత్ ఇండియాలోనే కాదు మొత్తం దేశంలో అత్యధిక రీమేక్స్ చేసిన సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా. సిద్ధార్థ్, త్రిష నటించిన ఈ సినిమాను మొత్తంగా 9సార్లు రీమేక్ చేయడం విశేషం. తమిళం, కన్నడ, బెంగాలీ, మణిపురి, ఒడియా, పంజాబీ, బంగ్లాదేశీ బెంగాలీ, నేపాలీ, హిందీ భాషల్లో ఈ మూవీ రీమేక్ అయింది.

IPL_Entry_Point