Sourav Ganguly For Khakee The Bengal Chapter: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గంగూలీ.. ఆడిషన్ కు అటెండ్.. చివర్లో ట్విస్ట్-sourav ganguly in police uniform attends audition for netflix ott show khakee the bengal chapter ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sourav Ganguly For Khakee The Bengal Chapter: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గంగూలీ.. ఆడిషన్ కు అటెండ్.. చివర్లో ట్విస్ట్

Sourav Ganguly For Khakee The Bengal Chapter: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గంగూలీ.. ఆడిషన్ కు అటెండ్.. చివర్లో ట్విస్ట్

Sourav Ganguly For Khakee The Bengal Chapter: టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు సౌరభ్ గంగూలీ కొత్త అవతారం ఎత్తాడు. యాక్టింగ్ కు సై అంటున్నాడు. ఆడిషన్ కు కూడా వెళ్లాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కోపం చూపించాడు. యాక్టింగ్ చేశాడు. కానీ చివరకు ఓ ట్విస్ట్ నెలకొంది.

పోలీస్ యూనిఫాంలో సౌరభ్ గంగూలీ (x/NetflixIndia)

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మారాడు. క్రిమినల్స్ ను చితక్కొట్టాడు. కోపంతో అరిచాడు. ఇలా ఆడిషన్ లో అన్నీ చేశాడు. కానీ చివరకు మాత్రం ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ టీమిండియా ప్రిన్స్ సినిమాల్లో యాక్ట్ చేయడం లేదు. సిరీస్ కోసమూ సెలక్ట్ కాలేదు. ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ సిరీస్ కోసం దాదా ప్రమోషన్లో భాగమయ్యాడు.

పోలీస్ గా దాదా

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో రాబోతున్న ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ కోసం దాదా రంగంలోకి దిగాడు. నెట్‌ఫ్లిక్స్‌ సోమవారం (మార్చి 17) రిలీజ్ చేసిన ప్రోమోలో గంగూలీ అదరగొట్టాడు. బెంగాల్ పేరుతో సిరీస్ చేస్తూ దాదాను పిలవరా? అని గంగూలీ రాకతో ప్రోమో స్టార్ట్ అయింది. పోలీస్ రోల్ చేస్తానంటూ దాదా యాక్షన్ లోకి దిగిపోయాడు.

ఈ ప్రోమోలో కొన్ని క్రికెట్ రిఫరెన్స్ కూడా వాడుకున్నారు. దాదాకు కోపం రావాలంటూ చెప్పగా.. అప్పటి కోచ్ గ్రెగ్ ఛాపెల్ ను గంగూలీ గుర్తుకు తెచ్చుకున్నట్లు చూపించారు. ఆ వెంటనే గంగూలీ కోపంతో అరిచాడు. ఆ తర్వాత క్రిమినల్ ను ఇంటరాగేషన్ చేస్తూ లాఠీతో కవర్ డ్రైవ్, ఆఫ్ కట్, ఫుల్, హుక్ షాట్లు ఆడుతున్నట్లు కనిపించాడు. కానీ చివరకు కేవలం 8 సెకన్లలోనే ఇవన్నీ చేయాలని డైరెక్టర్ చెప్పగానే దాదా స్టన్ అయ్యాడు.

ప్రమోషన్స్ కోసం

8 సెకన్లలో ఇవన్నీ తాను చేయలేనని చెప్పిన దాదా.. మరో రోల్ ఉందా అని అడగడం కనిపించింది. వెంటనే షో కు మార్కెటింగ్ చేయాలని చెప్పడంతో దాదా ఓకే అన్నాడు. ఈ ప్రోమో ఫ్యాన్స్ కు వివపరీతంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ కొత్త సిరీస్ పై మరింత బజ్ క్రియేట్ చేసింది.

నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో కొత్త సిరీస్ రాబోతోంది. నీరజ్ పాండే క్రియేట్ చేసిన ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ మార్చి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ‘ఖాకీ: ది బిహార్ ఛాప్టర్’కు సీక్వెల్ గా ఇది తెరకెక్కింది. ఈ సిరీస్ కు దెబాత్మ మండల్, తుషార్ కాంతి రే డైైరెక్టర్లు. హిందీ, బెంగాలీ భాషల్లో రాబోతున్న ఈ సిరీస్ కు షీతల్ భాటియా ప్రోడ్యూసర్. జీత్ గంగూలీ మ్యూజిక్ డైరెక్టర్.

జీత్, ప్రొసెన్ జీత్ ఛటర్జీ, పరాంబ్రత ఛటర్జీ, చిత్రాంగద సింగ్ తదితరులు ఈ సిరీస్ లో యాక్ట్ చేశారు. బెంగాల్ 2000ల్లో ఐపీఎస్ అర్జున్ మైత్రా, గ్యాంగ్ స్టర్స్, అవినీతి పొలిటీషియన్స్ మధ్య యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కింది.

దాదా ఏమన్నారంటే

‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ కోసం కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని గంగూలీ అన్నాడు. ‘‘థ్రిల్లర్స్, కాప్ డ్రామా అంటే నాకెంతో ఇష్టం. ఖాకీ ప్రాంఛైజీ నా ఫేవరెట్. అందుకే నెట్‌ఫ్లిక్స్‌ అడగ్గానే కొలబరేషన్ కు ఒప్పుకొన్నా. ఈ సిరీస్ ను కోల్ కతాలోనే షూట్ చేశారు. గ్రిప్పింగ్, స్టెల్లార్ పర్ ఫార్మెన్స్ తో ఈ సిరీస్ మస్ట్ వాచ్ గా నిలుస్తుంది’’ అని గంగూలీ చెప్పాడు.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం