Sound Party OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న బిగ్‍బాస్ విన్నర్ సన్నీ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Sound Party OTT Release Date: బిగ్‍బాస్ ఫేమ్ వీజే సన్నీ హీరోగా నటించిన సౌండ్ పార్టీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రం ఎప్పుడు.. ఏ ఓటీటీలోకి వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
Sound Party OTT Release Date: సీరియల్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న వీజే సన్నీ.. బిగ్‍బాస్ తెలుగు 5వ సీజన్‍తో చాలా పాపులర్ అయ్యాడు. ఆ సీజన్‍లో విజేతగా నిలువడంతో పాటు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఆ జోష్‍తోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో విజే సన్నీ హీరోగా నటించిన సౌండ్ పార్టీ సినిమా గతేడాది నవంబర్ 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు సౌండ్ పార్టీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.
సౌండ్ పార్టీ సినిమా ఫేమస్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ‘ఆహా’లో అడుగుపెడుతోంది. మార్చి 8వ తేదీన ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (మార్చి 4) అధికారికంగా వెల్లడించింది.
“సౌండ్ డీటీఎస్‍లో మోగిద్దామా. ఆహాలో సౌండ్ పార్టీ. మార్చి 8న ప్రీమియర్ కానుంది” అని ఆహా ట్వీట్ చేసింది. బ్రైట్ కామెడీ మూవీ అంటూ ఓ పోస్టర్ ట్వీట్ చేసింది. సన్నీతో పాటు హీరోయిన్ హృతికా శ్రీనివాస్, శివన్నారాయణ ఈ పోస్టర్‌లో ఉన్నారు.
మూడు నెలల తర్వాత..
సౌండ్ పార్టీ సినిమా సుమారు 100 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. గత నవంబర్ 24 థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ అయింది. అయితే, ముందుగా ఓటీటీ డీల్ కుదుర్చుకోలేకపోయింది. అయితే, ఆలస్యమైనా ఎట్టకేలకు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. దీంతో మార్చి 8న ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్‍కు రానుంది.
సౌండ్ పార్టీ సినిమాలో వీజే సన్నీ, హృతిక శ్రీనివాస్ హీరోహీరోయిన్లుగా నటించగా.. శివన్నారాయణ, పృథ్విరాజ్, అలీ, సప్తగిరి కీలకపాత్రలు పోషించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సంజయ్ షేరి.
సౌండ్ పార్టీ చిత్రాన్ని ఫుల్ మూన్ మీడియా పతాకంపై రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మదీన్ సంగీతం అందించగా.. శ్రీనివాస్ జే రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
‘సౌండ్ పార్టీ’ స్టోరీ బ్యాక్‍డ్రాప్ ఇదే
భారీగా డబ్బు సంపాదించాలని నానా తంటాలు పడి.. కష్టాల్లో చిక్కుకునే తండ్రీ కొడుకుల చుట్టూ సౌండ్ పార్టీ సినిమా కథ తిరుగుతుంది. డాలర్ కుమార్ (వీజే సన్నీ), అతడి తండ్రి కుబేర్ కుమార్ (శివన్నారాయణ) ఎలాగైనా ధనవంతులు కావాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో భారీగా అప్పులు చేసి ఓ హోటల్ పెడతారు. సిరి (హృతిక)ని కుమార్ ప్రేమిస్తాడు. అయితే, కుమార్ హోటల్ బిజినెస్‍ను సిరి తండ్రి పాడుచేస్తాడు. దీంతో తండ్రీకొడుకులు కుబేర్, డాలర్ మళ్లీ కష్టాల్లో చిక్కుకుంటారు. అయితే, తీర్చాల్సిన అప్పుడు భారీగా ఉంటాయి. దీంతో తన కుమారుడు చేసిన నేరాన్ని తమ మీద వేసుకొని జైలుకు వెళితే భారీగా డబ్బు ఇస్తానని తండ్రీకొడుకులకు ఎమ్మెల్యే వరప్రసాద్ (పృథ్విరాజ్) ఆశ చూపుతాడు. దీంతో వారిద్దరూ జైలుకు వెళతారు. ఏకంగా ఉరిశిక్ష పడుతుంది. అయితే, ఈ శిక్ష నుంచి డాలర్ కుమార్, కుబేర్ బయటపడ్డారా? అసలు ఎమ్మెల్యే కొడుకు చేసిన నేరమేంటి? చివరికి ఏం జరిగిందనేదే సౌండ్ పార్టీ ప్రధానమైన అంశాలుగా ఉంటాయి.