OTT Malayalam: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మలయాళం బ్లాక్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!
Sookshmadarshini OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ మలయాళ బ్లాక్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ సూక్షదర్శిని స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్, బాసిల్ జోసెఫ్ మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమా తెలుగుతో సహా ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
Sookshmadarshini OTT Release: మలయాళం సినిమాలకు ఉండే క్రేజ్ మాములుగా ఉండదు. మాలీవుడ్ నుంచి డిఫరెంట్ జోనర్స్ సినిమాలు రావడమే కాకుండా అవి ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి. చాలా వరకు మలయాళ సినిమాలకు ఇండియా వైడ్ ఆడియెన్స్‌ను ఆకర్షిస్తుంటాయి.
పుష్ప 2 విలన్ భార్య
అలా ఇటీవల చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన మలయాళ మూవీనే సూక్మదర్శిని. పుష్ప 1, పుష్ప 2 విలన్ ఫహాద్ ఫాజిల్ భార్య, హీరోయిన్ నజ్రియా నజీమ్, డైరెక్టర్ అండ్ హీరో బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన సూక్మదర్శిని సినిమాకు ఎమ్‌సీ జితిన్ దర్శకత్వం వహించారు.
బడ్జెట్ అండ్ కలెక్షన్స్
మలయాళం నుంచి బ్లాక్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన సూక్షదర్శిని సినిమాను సామిర్ తాహిర్, షైజు ఖైలాద్, ఏవీ అనూప్ నిర్మించారు. 2024లో నవంబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయిన సూక్మదర్శిని బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది. దాదాపుగా రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సూక్షదర్శిని ఇండియాలో రూ. 27 కోట్ల నెట్, రూ. 32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
ఇవాళ ఓటీటీలోకి
అలాగే, వరల్డ్ వైడ్‌గా సూక్షదర్శిని సినిమాకు రూ. 55.92 అంటే సుమారుగా రూ. 60 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ్టీ (జనవరి 11) నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సూక్మదర్శిని ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అదు కూడా ఐదు భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
ముందుగా జీ5 ఓటీటీలో అంటూ!
డిస్నీ హాట్‌స్టార్‌లో ఒరిజినల్ లాంగ్వేజ్ అయిన మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సూక్షదర్శిని ఓటీటీ రిలీజ్ అయింది. అలాగే, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. అయితే, మొదట ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను జీ5 కొనుగోలు చేసిందని టాక్ వినిపించింది. కానీ, అనూహ్యంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కి సూక్మదర్శిని ఓటీటీ హక్కులు సొంతం అయ్యాయి.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనౌన్స్‌మెంట్
రెండ్రోజుల క్రితమే జనవరి 11 నుంచి ఐదు భాషల్లో సూక్షదర్శిని ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది. అనౌన్స్‌మెంట్‌కు తగినట్లుగా ఓటీటీ రిలీజ్ అయింది ఈ మూవీ. ఇదిలా ఉంటే సూక్షదర్శిని సినిమా మాన్యుయేల్, ప్రియదర్శిని పాత్రల చుట్టూ ఎక్కువ జరుగుతుంటుంది.
తల్లితో కలిసి
ప్రియదర్శిని తన భర్త, కూతురుతో జీవిస్తుంటుంది. అందరితో సంతోషంగా ప్రియదర్శిని జీవిస్తున్న తన కాలనీలోకి కొత్తగా తన తల్లితో కలిసి మాన్యుయేల్ వస్తాడు. ఆ కాలనీవాసులతో కలిసిపోయి కలుపుకోలుగా ఉంటాడు మాన్యుయేల్. కానీ, అతన్ని అనుమానిస్తుంటుంది ప్రియదర్శిని. దాంతో మాన్యుయేల్‌ను ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉంటుంది ప్రియదర్శిని.
ట్విస్టులు
అలా మాన్యుయేల్‌ను అనుమానించిన ప్రియదర్శినికి ఎలాంటి నిజాలు తెలిసాయి, అసలు మాన్యుయేల్ ఏం చేస్తాడు. అతను దాచిపెట్టింది ఏంటీ అనే విషయాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కామెడీని మిక్స్ చేసి మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సూక్షదర్శిని ఓటీటీలో చూసేందుకు బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు.
సంబంధిత కథనం