సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన 7/జీ మూవీని తెలుగులో ఫ్రీగా చూడొచ్చు. ఈ హారర్ మూవీ తెలుగు వెర్షన్ మంగళవారం యూట్యూబ్‌లో రిలీజైంది. 7/జీ మూవీకి హరూన్ దర్శకత్వం వహించాడు. అతడే స్వయంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ఈ హారర్ మూవీలో సోనియా అగర్వాల్‌తో పాటు స్మృతి వెంకట్, సిద్ధార్థ్ విపిన్ కీలక పాత్రలు పోషించారు. హీరోగా నటించిన సిద్ధార్థ్ విపిన్ 7/జీ సినిమాకు మ్యూజిక్ అందించడం గమనార్హం.
గత ఏడాది జూలైలో 7/జీ తమిళ వెర్షన్ థియేటర్లలో రిలీజైంది. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా డిజాస్టర్‌గా నిలిచింది. సోనియా అగర్వాల్ హీరోయిన్‌గా నటించడం, టీజర్, ట్రైలర్స్‌తో ఈ చిన్న సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. కానీ రొటీన్ స్టోరీ, రెగ్యులర్ హారర్ ఎలిమెంట్స్ కారణంగా 7/జీ సరైన వసూళ్లను దక్కించుకోలేకపోయింది
రాజీవ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుంటాడు. భార్య వర్ష (స్మృతి వెంకట్) కలను నెరవేరుస్తూ రాజీవ్ (సిద్ధార్థ్ విపిన్ ) సొంతంగా ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకుంటాడు.7/జీ అనే ఫ్లాట్‌లో అడుగుపెడతారు. గృహ ప్రవేశం జరిగిన తర్వాత రోజే రాజీవ్ ఆఫీస్ పనిమీద వేరే ఊరికి వెళ్లిపోతాడు. కొడుకుతో కలిసి వర్ష ఒంటరిగా కొత్త ఇంట్లో ఉంటుంది.
తమతో పాటు ఆ ఫ్లాట్‌లో దయ్యం కూడా ఆ ఇంట్లో ఉందనే నిజం వర్షకు తెలుస్తుంది. వర్ష కంటే ముందు ఆ ఇంట్లో ఉన్న మంజుల (సోనియా అగర్వాల్) చనిపోయి ఎలా దయ్యమైంది? ఆమె మరణానికి కారకులు ఎవరు? మంజుల బారి నుంచి తన కొడుకును వర్ష ఎలా కాపాడుతుంది? మంజుల పగ ఎవరిపై అన్నదే ఈ మూవీ కథ.
సోనియా అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన 7/జీ బృందావన కాలనీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ మూవీ టైటిల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ ఈ హారర్ మూవీకి 7/జీ అని పేరు పెట్టారు. కానీ ఆ మ్యాజిక్‌ను ఈ మూవీ రిపీట్ చేయలేకపోయింది.
7/జీ బృందావన కాలనీ తో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను మెప్పించింది సోనియా అగర్వాల్. ఆ తర్వాత విన్నర్, అమ్మా నాన్న ఊరెళితే తో పాటు తెలుగులో కొన్ని స్ట్రెయిట్ సినిమాలు చేసింది.
అవేవీ ఆమె కెరీర్‌ను నిలబెట్టలేకపోయాయి. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సోనియా అగర్వాల్ డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తోంది. ఎక్కువగా హారర్ సినిమాల్లోనే ఆమెకు అవకాశాలు దక్కుతున్నాయి. గత రెండేళ్లలో 7/జీతో పాటు బిహైండ్, గ్రాండ్‌మా తో పాటు పలు హారర్ సినిమాలు చేసింది.
సంబంధిత కథనం
టాపిక్