Sonam Kapoor: ర్యాంప్ వాక్ చేస్తూ ఏడ్చేసిన స్టార్ హీరోయిన్.. దండం పెడుతూ సోనమ్ కపూర్ కన్నీళ్లు (వీడియో)
Sonam Kapoor Tears At Ramp Walk Video Viral: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సోనమ్ కపూర్ ఓ ర్యాంప్ వాక్‌లో నడుస్తూ ఏడ్చేసింది. దండం పెట్టి మరి కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి సోనమ్ కపూర్ కన్నీళ్లకు గల కారణాలు ఏంటో తెలసుకుందాం.
Sonam Kapoor Crying In Ramp Walk Video Viral: బాలీవుడ్ దిగ్గజ నటుడు అనిల్ కపూర్ కుమార్తె, స్టార్ హీరోయిన్లలో ఒకరైన సోనమ్ కపూర్ తాజాగా ఓ ఈవెంట్‌లో కన్నీళ్లు పెట్టేసుకుంది. ర్యాంప్ వాక్‌పై నడుస్తూ ఎమోషనల్ అయిపోయింది. దండం పెట్టి మరి ఏడ్చేసింది సోనమ్ కపూర్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ షో
గురుగ్రామ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో దివంగత ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్‌కు హృదయపూర్వక నివాళి అర్పిస్తూ భావోద్వేగానికి గురయింది సోనమ్ కపూర్. శనివారం (ఫిబ్రవరి 1) జరిగిన బ్లెండర్స్ ప్రైడ్ ఎఫ్‌డీసీఐ (Fashion Design Council of India) ఫ్యాషన్ టూర్ 2025లో నటి ర్యాంప్‌పై నడుస్తున్న అనేక వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వెలువడ్డాయి.
సోనమ్ కపూర్ ఏడ్చిన వీడియో
ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోన్న ఒక వీడియోలో సోనమ్ కపూర్ ర్యాంప్‌పై నడుస్తుండగా ఏడుస్తున్నట్లు కనిపించింది. ప్రేక్షకులకు చేతులు జోడించి అభివాదం చేస్తూ మరి కన్నీళ్లు పెట్టుకోవడం ఆ వీడియోలో మనం చూడొచ్చు. ఇక ఈ ఫ్యాషన్ షోలో సోనమ్ కపూర్ భారీ అలంకరణతో కనిపించింది. పొడవైన ఐవరీ జాకెట్ కింద తెల్లటి దుస్తులను ధరించింది. ఆమె తన జుట్టును కట్టుకుని, ఎరుపు రంగు పూలను పెట్టుకుంది.
ఫ్యాషన్ డిజైనర్‌కు నివాళిగా
అయితే, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్‌కు నివాళిగా చేపట్టిన ర్యాంప్ వాక్‌లో సోనమ్ కపూర్ భావోద్వేగానికి లోనయి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఫ్యాషన్ షోను వివిధ రంగాలకు చెందిన 63 మంది ప్రముఖులతో ప్రత్యేక రన్‌వే ప్రదర్శనతో రోహిత్ బాల్‌కు నివాళులు అర్పించారు.
ర్యాంప్ వాక్ చేసిన డైరెక్టర్
చిత్ర దర్శకుడు మధుర్ భండార్కర్, ఫ్యాషన్ డిజైనర్ జేజే వలయా, నటి ఈషా గుప్తా, నటుడు రాహుల్ దేవ్, ముగ్ధా గోడ్సే కూడా ఈ దివంగత ఫ్యాషన్ డిజైనర్‌కు నివాళులు అర్పించడానికి ర్యాంప్‌పై నడిచారు. కాగా ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ గత సంవత్సరం నవంబర్‌లో 63 ఏళ్ల వయసులో మరణించారు.
అదృష్టంగా భావిస్తున్నా
ర్యాంప్ అనంతరం ఏఎన్ఐతో మాట్లాడిన సోనమ్ కపూర్ డిజైనర్ రోహిత్ బాల్‌ను గుర్తు చేసుకుంది. "గుడ్డా (రోహిత్ బాల్) కోసం ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. అతను డిజైన్ చేసిన దుస్తులను చాలాసార్లు ధరించడం, నాకు చాలాసార్లు డిజైన్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. అతని చివరి షో చేయడం చాలా అద్భుతంగా ఉంది" అని సోనమ్ కపూర్ తెలిపింది.
చాలా అందమైన ఆలోచన
"అతని వారసత్వం, కళాకృషి వంటి వాటిని సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన చాలా అందమైన, ఆనందదాయకమైనది. అతను అంత గొప్పవాడు. అదేవిధంగా, నేను కూడా ఆయన డిజైన్ చేసిన దుస్తులను ధరించడాన్ని కూడా నేను అలాగే భావిస్తాను. ఇది నాకు చాలా ఇష్టం" అని సోనమ్ కపూర్ చెప్పుకొచ్చింది.
సంబంధిత కథనం