Sonakshi Sinha Wedding: సోనాక్షి పెళ్లి జరిగిన ఐదు రోజులకే హాస్పిటల్లో చేరిన తండ్రి శతృఘన్ సిన్హా-sonakshi sinha wedding her father shatrughan sinha admitted to hospital just 5 days after her marriage ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sonakshi Sinha Wedding: సోనాక్షి పెళ్లి జరిగిన ఐదు రోజులకే హాస్పిటల్లో చేరిన తండ్రి శతృఘన్ సిన్హా

Sonakshi Sinha Wedding: సోనాక్షి పెళ్లి జరిగిన ఐదు రోజులకే హాస్పిటల్లో చేరిన తండ్రి శతృఘన్ సిన్హా

Hari Prasad S HT Telugu
Jun 28, 2024 10:14 PM IST

Sonakshi Sinha Wedding: సోనాక్షి సిన్హా పెళ్లి జరిగిన ఐదు రోజులకే ఆమె తండ్రి శతృఘన్ సిన్హా హాస్పిటల్లో చేరాడు. దీంతో కూతురు, అల్లుడు హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు.

సోనాక్షి పెళ్లి జరిగిన ఐదు రోజులకే హాస్పిటల్లో చేరిన తండ్రి శతృఘన్ సిన్హా
సోనాక్షి పెళ్లి జరిగిన ఐదు రోజులకే హాస్పిటల్లో చేరిన తండ్రి శతృఘన్ సిన్హా

Sonakshi Sinha Wedding: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తండ్రి, ప్రముఖ బాలీవుడ్ నటుడు శతృఘన్ సిన్హా హాస్పిటల్లో చేరాడు. ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేశారు. ఈ మధ్యే సోనాక్షి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. వెంటనే ఇలా జరగడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే రొటీన్ చెకప్ కోసమే శతృఘన్ హాస్పిటల్లో చేరినట్లు తెలిసింది.

హాస్పిటల్లో శతృఘన్ సిన్హా

ఒకప్పుడు బాలీవుడ్ లోని ప్రముఖ నటుల్లో ఒకరు శతృఘన్ సిన్హా. తర్వాత రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా ఉన్నాడు. అతని కూతురు సోనాక్షి సిన్హా కూడా బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ మధ్యే అంటే జూన్ 23న ఆమె జహీర్ ఇక్బాల్ అనే నటుడిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వాళ్ల పెళ్లి జరిగిన ఐదు రోజులకే శతృఘన్ హాస్పిటల్లో చేరాడు.

దీంతో అతన్ని చూడటానికి సోనాక్షి, జహీర్ హాస్పిటల్ కు వచ్చిన వీడియో వైరల్ అయింది. అతనికి ఏమైందో ఆందోళన అభిమానుల్లో కనిపించింది. అయితే రొటీన్ చెకప్ కోసమే అని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో డాక్టర్లు అతనికి చికిత్స అందిస్తున్నారు. సోనాక్షి పెళ్లి సమయంలో హడావిడి కారణంగా కాస్త ఒత్తిడికి లోనవడంతో అతడు కాస్త అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది.

చెబుతారంతే.. అనుమతి తీసుకోరు..

సోనాక్షి సిన్హా ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. వీళ్ల పెళ్లికి ముందు కూడా దీనిపై శతృఘన్ సిన్హా స్పందించాడు. ఈ కాలం పిల్లలు కేవలం విషయం చెబుతారు తప్ప తల్లిదండ్రుల అనుమతి తీసుకోరు అని అని అతడు అన్నాడు. దీంతో సోనాక్షి పెళ్లి ఆమె కుటుంబానికి ఇష్టం లేదన్న వార్తలు వచ్చాయి.

అయితే రిజిస్టర్ మ్యారేజ్ తర్వాత కొత్త దంపతులు ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు శతృఘన్ సహా కుటుంబం మొత్తం హాజరైంది. దీంతో ఆ పుకార్లలో అసలు నిజం లేదని తేలిపోయింది. ఆమె పెళ్లిని కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు స్పష్టమైంది. ఇక తాను ఓ ముస్లింను పెళ్లి చేసుకోవడంపై వచ్చిన ట్రోలింగ్ పైనా స్పందించిన సోనాక్షి సిన్హా.. ప్రేమే పెద్ద మతం అంటూ కామెంట్ చేయడం గమనార్హం.

అటు శతృఘన్ కూడా వీళ్ల పెళ్లి తర్వాత ఆ ఫొటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. తన కూతురు సోనాక్షి ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోందని ఈ సందర్భంగా అతడు తెలిపాడు.

WhatsApp channel