House for sale: మొన్నే పెళ్లి చేసుకున్న హీరోయిన్.. అప్పుడే ఇల్లు అమ్మకానికి.. అసలేం జరిగింది?
House for sale: ఈ మధ్యే పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి అప్పుడే తన ఇంటిని అమ్మకానికి పెట్టేసింది. అదే ఇంట్లోనే తన పెళ్లి జరగడం విశేషం. రెండు నెలల్లో అదే ఇంటిని ఆమె అమ్మకానికి పెట్టడంతో అభిమానులు షాక్ తింటున్నారు. అసలు ఏం జరిగిందని ఆరా తీస్తున్నారు.
House for sale: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన ఇంటిని అమ్మకానికి పెట్టిందన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అదే ఇంట్లో గత జూన్ నెలలో తన బాయ్‌ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకున్న ఆమె.. అంతలోనే ఈ ఇంటిని ఎందుకు అమ్మేస్తోందన్న చర్చ నడుస్తోంది. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్ ధరను రూ.25 కోట్లుగా నిర్ణయించడం విశేషం.
ఇల్లు అమ్ముతున్న సోనాక్షి
బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘన్ సిన్హా కూతురు, నటి సోనాక్షి సిన్హా రెండు నెలల కిందట పెళ్లి చేసుకున్న విషయం తెలుసు కదా. గతేడాదే కొనుగోలు చేసిన తన సొంత ఇంట్లోనే ఈ పెళ్లి జరిగింది. అయితే ఇప్పుడా ఇంటిని ఆమె అమ్మకానికి పెట్టింది. ఓ రియల్ ఎస్టేట్ ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో ఈ ఇంటికి సంబంధించిన వీడియో రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
ముంబైలోని బాంద్రా ఏరియాలో 81 ఆరేట్ బిల్డింగ్ లో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ చాలా విలాసవంతమైనదని, 4200 అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సీ ఫేసింగ్ ఇల్లు నిజానికి 4 బీహెచ్‌కే అయినా తర్వాత 2 బీహెచ్‌కేగా మార్చేశారని ఆ వీడియోలో చెప్పడం చూడొచ్చు. అన్ని ఆధునిక వసతులు ఉన్న ఈ అపార్ట్‌మెంట్ ను రూ.25 కోట్లకు అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు. ఈ పోస్టును సోనాక్షి లైక్ కూడా చేసింది.
ఫ్యాన్స్ రియాక్షన్ ఇదీ
ఈ వీడియో చూడగానే ఇది సోనాక్షి ఇల్లే కదా అంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ఇంత త్వరగా తన ఇంటిని విడిచి ఆమె ఎందుకు వెళ్లిపోతోంది.. అసలు ఏం జరిగింది అని పలువురు ప్రశ్నించారు. ఈ మధ్యే ఈ ఇల్లు కొన్న ఆమె.. అప్పుడు ఎందుకు అమ్మేస్తోందని అడిగారు.
గతేడాది సెప్టెంబర్ లో సోనాక్షి సిన్హా ఈ ఇంటిని కొనుగోలు చేసింది. బాంద్రా రెక్లామేషన్ లోని 81 ఆరేట్ బిల్డింగ్ 26వ అంతస్తులో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ అత్యంత విలాసవంతమైనది. అప్పట్లో రూ.11 కోట్లకే ఈ ఇంటిని కొనడం విశేషం. ఈ ఇంటి నుంచి చూస్తే మాహిమ్ బే, బాంద్రా వర్లీ సీ లింక్ స్పష్టంగా కనిపిస్తాయి.