Sonakshi Sinha: పెళ్లయిన పది రోజులకే ప్రెగ్నెన్సీ.. బాలీవుడ్ నటి రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు-sonakshi sinha pregnancy rumors bollywood actress funny reaction gone viral here is what she said ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sonakshi Sinha: పెళ్లయిన పది రోజులకే ప్రెగ్నెన్సీ.. బాలీవుడ్ నటి రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు

Sonakshi Sinha: పెళ్లయిన పది రోజులకే ప్రెగ్నెన్సీ.. బాలీవుడ్ నటి రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు

Hari Prasad S HT Telugu

Sonakshi Sinha: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా పెళ్లయిన పది రోజులకే తాను ప్రెగ్రెంట్ అంటూ వస్తున్న వార్తలపై ఫన్నీగా స్పందించింది. తానిక హాస్పిటల్ కు వెళ్లనని చెప్పడం విశేషం.

పెళ్లయిన పది రోజులకే ప్రెగ్నెన్సీ.. బాలీవుడ్ నటి రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు

Sonakshi Sinha: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రెగ్నెంటా? గత నెల 23నే పెళ్లి చేసుకున్న ఆమె గర్భం దాల్చిందంటూ రెండు, మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఆమె సరదాగా చేసిన కామెంట్స్ ఆ వార్తల కంటే వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యే ఆమె టైమ్స్ నౌతో మాట్లాడుతూ తన ప్రెగ్నెన్సీ పుకార్లపై స్పందించింది.

హాస్పిటల్‌కు వెళ్లలేను

సోనాక్షి సిన్హా జూన్ 23న తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ను జూన్ 23న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ వెంటనే ఈ జంట హాస్పిటల్ కు వెళ్లింది. దీంతో సోనాక్షి అప్పుడే ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు మొదలయ్యాయి. వీటిపై తాజాగా ఆమె టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో స్పందించింది. తన నెక్ట్స్ మూవీ కాకుదా ప్రమోషన్లలో భాగంగా ప్రస్తుతం ఆమె బిజీగా ఉంది.

ఈ సందర్భంగా పెళ్లి తర్వాత జీవితంపై సోనాక్షి మాట్లాడింది. "జీవితం ఇంతకంటే గొప్పగా ఉండదు. నా పెళ్లిలో విశేషం ఏమిటంటే జీవితంలో పెద్ద మార్పేమీ రాలేదు. పెళ్లికి ముందు కూడా నా జీవితం ఎంతో బాగుండేది. ఇప్పుడు మళ్లీ అందులోకే తిరిగి వచ్చాను. మళ్లీ షూటింగులు మొదలుపెట్టడం సంతోషంగా ఉంది. ఒకే ఒక్క మార్పు ఏంటంటే.. ఇప్పటి నుంచి మేము హాస్పిటల్ వెళ్లలేము. ఎందుకంటే అక్కడికి వెళ్తే చాలు నేను ప్రెగ్నెంట్ అని అందరూ అనుకుంటారు" అని సోనాక్షి అనడం విశేషం.

సోనాక్షి, జహీర్ పెళ్లి

సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ ఏడేళ్ల డేటింగ్ తర్వాత జూన్ 23న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఓ ముస్లింను పెళ్లి చేసుకోవడంపై కూడా సోనాక్షిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే ప్రేమే పెద్ద మతం అంటూ ఆ ట్రోలింగ్ ను ఆమె తిప్పికొట్టింది. జహీర్ కూడా ఓ నటుడే. సోనాక్షితో కలిసి అతడు డబుల్ ఎక్స్ఎల్ మూవీలో నటించాడు.

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త ఇక్బాల్ రతానీ తనయుడే ఈ జహీర్ ఇక్బాల్. అతని తొలి సినిమా నోట్‌బుక్. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ ప్రమోట్ చేశాడు. ఇక సోనాక్షి పెళ్లి తర్వాత ఆమె తండ్రి శత్రుఘన్ సిన్హా తీవ్ర జ్వరంతో హాస్పిటల్లో చేరాడు. అతన్ని చూడటానికే సోనాక్షి, జహీర్ వెళ్లారు. అప్పటి నుంచే ప్రెగ్నెన్సీ రూమర్లు మొదలయ్యాయి.

మరోవైపు సోనాక్షి సిన్హా పెళ్లి తర్వాత రిలీజ్ అవుతున్న తొలి సినిమా కాకుదా. ఈ హారర్ కామెడీ మూవీ నేరుగా జీ5 ఓటీటీలోకి వస్తోంది. జులై 12 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. శాపగ్రస్తమైన రథోడీ అనే ఊళ్లో ప్రతి మంగళవారం సాయంత్రం 7.15 గంటలకు కాకుదా అనే దెయ్యం వస్తుందని, ఆ సమయంలో ఎవరైతే తమ ఇంటి తలుపులు తెరవరో వాళ్లను 13 రోజుల్లో చంపేస్తుందన్న సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్ కూడా నటించాడు.