Beauty Teaser: బ్యూటీ టీజర్ రిలీజ్ - టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న సోషల్ మీడియా సెన్సేషన్!
Beauty Teaser: అంకిత్ కొయ్య హీరోగా నటించిన బ్యూటీ మూవీ టీజర్ రిలీజైంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో సోషల్ మీడియా సెన్సేషన్ నీలఖి పాత్ర హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు భలే ఉన్నాడే ఫేమ్ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Beauty Teaser: అంకిత్ కొయ్య హీరోగా నటిస్తోన్న బ్యూటీ మూవీ టీజర్ రిలీజైంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీతో సోషల్ మీడియా సెన్సేషన్ నీలఖి పాత్ర హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
వాలెంటైన్స్ డే రోజున...
వాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చేసిన బ్యూటీ టీజర్ ఆకట్టుకుంటోంది. అందమైన ప్రేమ కథతో పాటు, మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌ను టీజర్‌లో చూపించారు. స్కూటీ కారణంగా హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ ఏర్పడటం, మాటలు లేకుండా కేవలం చూపులతోనే భావాలను వ్యక్తపరుచుకోవడం ఆకట్టుకుంటోంది.
స్కూటీ చుట్టూ...
టీజర్ చూస్తుంటే ఓ స్కూటీ చుట్టూనే బ్యూటీ కథ తిరిగేలా ఉంది. స్కూటీ వచ్చాకా? ఏం జరుగుతుంది? అసలు హీరోయిన్ స్కూటీ కొనమని తండ్రిని ఎందుకు అడుగుతోంది..? ఆ స్కూటీ వచ్చాక హీరోయిన్‌లో వచ్చే మార్పులు ఏంటి? అంటూ టీజర్‌లో చూపించిన ప్రశ్నలు మూవీపై ఆసక్తిని రేకెత్తిస్తోన్నాయి. ఇక టీజర్‌లోని విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ‘లైఫ్‌లో నిన్ను ఇంకేం అడగను’ అనే డైలాగ్‌కు సినిమాలో చాలానే ఇంపార్టెన్స్ ఉందనిపిస్తోంది. అంకిత్ కొయ్య, నీలఖి క్యారెక్టర్స్‌తో పాటు నరేష్, వాసుకి క్యారెక్టర్స్‌ను చూపించారు.
భలే ఉన్నాడే ఫేమ్...
బ్యూటీ మూవీకి వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్ వెబ్‌సిరీస్‌లతో పాటు భలే ఉన్నాడే సినిమాలను వర్ధన్ తెరకెక్కించాడు. మారుతి టీం ప్రొడక్ట్‌తో కలిసి అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ బ్యూటీ మూవీని నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ మూవీకి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నాగచైతన్య మజిలీతో...
నాగచైతన్య మజిలీ మూవీతో యాక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అంకిత్ కొయ్య. జోహార్, శ్యామ్ సింగరాయ్, సత్యభామ, బచ్చలమల్లితో పాటు పలు తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. గత ఏడాది రిలీజైన ఆయ్‌తో పాటు మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. సినిమాలే కాకుండా 9 అవర్స్, మోడ్రన్ లవ్ ఇన్ హైదరాబాద్‌తో పాటు గుడ్ ఓల్డ్ డేస్ అనే వెబ్‌సిరీస్‌లు చేశాడు.
సంబంధిత కథనం