Sobhita Dhulipala Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్యతో ప్రేమ ఎలా మొదలైందో చెప్పింది శోభితా ధూళిపాళ్ల. తాజాగా ఈ జంట వోగ్ మ్యాగజైన్ ఏప్రిల్ ఎడిషన్ కోసం ఫొటోలకు పోజులిచ్చింది. ఈ సందర్భంగా అదే మ్యాగజైన్ తో మాట్లాడుతూ తమ లవ్ స్టోరీ ఎలా మొదలైందో శోభిత వెల్లడించింది.
నాగ చైతన్య, శోభిత గతేడాది డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్న విషయం తెలుసు కదా. అయితే అంతకుముందు రెండేళ్లుగా వీళ్లు డేటింగ్ లో ఉన్నారు. ఇదంతా ఓ సింపుల్ ఆస్క్ మీ ఎనీథింగ్ (ఏఎంఏ)లో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నతో మొదలైనట్లు శోభిత వెల్లడించడం విశేషం. “నేను ప్రశ్నలను చూస్తూ ఉన్నాను. అందులో ఓ ప్రశ్న ఆకర్షించింది.
మీరు ఎందుకు చైతన్య అక్కినేనిని ఫాలో చేయడం లేదు అని అడిగారు. అప్పుడు నేను ఏంటి అనుకున్నాను. ఆ తర్వాత అతని ప్రొఫైల్ లోకి వెళ్లి చూశాను. అతడు కేవలం 70 మందినే ఫాలో అవుతున్నాడు. అందులో నేనూ ఒకదానిని. నేను కాస్త సంతోషంతో అతన్ని ఫాలో అయ్యాను” అని శోభిత చెప్పుకొచ్చింది.
ఇన్‌స్టాగ్రామ్ లో ఒకరినొకరు ఫాలో కావడంతో మొదలైన వాళ్ల రిలేషన్షిప్ తర్వాత పెళ్లి వరకూ వెళ్లింది. ఇద్దరం మొదట్లో నేరుగా మెసేజ్ లు పంపించుకునేవాళ్లమని, ఏప్రిల్ 2022లో తొలి బ్రేక్‌ఫాస్ట్ డేట్ కోసం చై నేరుగా ముంబైకి వచ్చినట్లు శోభిత తెలిపింది.
“హంగామా ఏమీ లేదు. మా మధ్య ప్రేమ చాలా సింపుల్ గా అలా మొదలైపోయింది” అని శోభిత చెప్పింది. ఇద్దరూ ఒకరి కుటుంబాలను మరొకరు కలిశారు. ఆ తర్వాత మొదట నిశ్చితార్థం, తర్వాత పెళ్లి జరిగిపోయాయి.
నాగ చైతన్య, శోభిత గతేడాది ఆగస్ట్ 8న నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి వరకూ వీళ్ల డేటింగ్ ఓ పుకారు కాగా.. ఆరోజు నాగార్జునే వీళ్ల ఎంగేజ్మెంట్ ఫొటోలను షేర్ చేస్తూ కన్ఫమ్ చేశాడు. ఆ తర్వాత నాలుగు నెలలకు అంటే డిసెంబర్ 4న పెళ్లితో ఒక్కటయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో వీళ్ల పెళ్లి జరిగింది.
అంతకుముందు చైతన్య 2017లో సమంతను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ 2021లో విడిపోయారు. ఆ మరుసటి ఏడాదే అంటే 2022లోనే శోభిత, చైతన్య లవ్ స్టోరీ మొదలైంది.
సంబంధిత కథనం