Sobhita Dhulipala: భారత్‍లో విడుదల కాని శోభితా ధూళిపాళ్ల మూవీకి ప్రతిష్టాత్మక అవార్డు.. హాలీవుడ్ భారీ చిత్రాలను ఓడించి..
Sobhita Dhulipala - Monkey Man: శోభితా ధూళిపాళ్ల నటించిన మంకీ మ్యాన్ మూవీకి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. గోల్డెన్ టమాటో అవార్డు ఈ చిత్రాన్ని వరించింది. హాలీవుడ్ భారీ చిత్రాలను ఈ మూవీ ఓడించింది. ఆ వివరాలు ఇవే..
బాలీవుడ్, టాలీవుడ్‍లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల. ‘మంకీ మ్యాన్’ మూవీతో గతేడాది ఆమె హాలీవుడ్‍లోనూ అడుగుపెట్టారు. దేవ్ పటేల్ దర్శకత్వం వహించిన ఈ అమెకన్ మూవీలో శోభితా ఓ కీలకపాత్ర చేశారు. ఈ మంకీ మ్యాన్ సినిమాకు ఇప్పుడు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. డెడ్‍పూల్ 3, ది ఫాల్ గాయ్ లాంటి చిత్రాలను ఓడించి మరీ ఈ పురస్కారం దక్కించుకుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
అవార్డు వివరాలివే..
ప్రతిష్టాత్మక రొటెన్ టమాటోస్ అవార్డు మంకీ మ్యాన్ చిత్రానికి దక్కింది. బెస్ట్ యాక్షన్, అడ్వెంచర్ మూవీ కేటగిరీలో ఈ సినిమాకు గోల్డెన్ టమాటో పురస్కారం లభించింది. డెడ్‍పూల్ అండ్ వాల్వెరైన్, ది ఫాల్ గాయ్, ట్విస్టర్ లాంటి భారీ సినిమాలు నామినేషన్లలో ఉన్నా మంకీ మ్యాన్‍కే అవార్డు లభించింది. భారీ చిత్రాలను ఓడించి పురస్కారం కైవసం చేసుకుంది శోభితా ధూళిపాళ్ల నటించిన మూవీ.
ఇండియాలో నో పర్మిషన్
మంకీ మ్యాన్ మూవీ గ్లోబల్‍గా 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదలైంది. అయితే, ఇండియాలో ఈ చిత్రానికి అనుమతి దక్కలేదు. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి నో చెప్పింది. దీంతో ఇక్కడ రిలీజ్ కాలేదు. హనుమంతుడి స్ఫూర్తిగా ఈ చిత్రంలో ప్రధాన పాత్రను రూపొందించారు. అయితే, ఈ మూవీ కొందరి మనోభావాలను కించపరిచే విధంగా ఉందని సెన్సార్ బోర్డు అభిప్రాయపడినట్టు రూమర్లు వచ్చాయి. స్క్రీనింగ్ కూడా జరగనట్టు తెలిసింది. మొత్తంగా మంకీ మ్యాన్ మూవీ ఇండియాలో రిలీజ్ కాలేదు. గ్లోబల్‍గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇండియాలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో లేదు.
మంకీ మ్యాన్ సినిమాలో దేవ్ పటేల్, పితోబాష్, శోభితా ధూళిపాళ్ల, సికిందర్ ఖేర్, మకరంద్ దేశ్‍పాండే కీలకపాత్రలు పోషించారు. దేవ్ పటేలే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 10 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం సుమారు 35 మిలియన్ డాలర్ల కలెక్షన్లను దక్కించుకుంది. కమర్షియల్‍గా బ్లాక్‍బస్టర్ అయింది. ఈ మూవీని ఎనిమిది ప్రొడక్షన్ హౌస్‍లు కలిసి నిర్మించాయి. జెడ్ కుర్జేల్ సంగీతం అందించారు.
నాగచైతన్య, శోభితా పెళ్లి
టాలీవుడ్ హీరో నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల గత నెల డిసెంబర్ 4న ఘనంగా వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్‍లో వీరి పెళ్లి జరిగింది. గోల్డెన్ కలర్ చీర, బంగారు ఆభరణాల్లో ఈ వేడుకలో శోభిత మెరిసిపోయారు. 2021లో సమంతతో వీడిపోయారు చైతూ. సుమారు నాలుగేళ్ల తర్వాత శోభితను వివాహం చేసుకున్నారు.
సంబంధిత కథనం