Sobhita Dhulipala Movie: పెళ్లి, పిల్లలు కావాలి అంటున్న శోభితా ధూళిపాళ్ల.. ఇంట్రెస్టింగా ట్రైలర్.. నేరుగా ఓటీటీలోకి మూవీ
Sobhita Dhulipala Movie: శోభిత ధూళిపాళ్ల తనకు పెళ్లి, పిల్లలు కావాలంటోంది. నాగ చైతన్యకు కాబోయే భార్య నటిస్తున్న మూవీ లవ్, సితార ట్రైలర్ గురువారం (సెప్టెంబర్ 12) రిలీజ్ కాగా.. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకే రానుంది.
Sobhita Dhulipala Movie: నాగ చైతన్య కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల నటించిన మూవీ లవ్, సితార. ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ఈ మధ్యే అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ.. తాజాగా గురువారం (సెప్టెంబర్ 12) ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ మూవీలో శోభితతోపాటు రాజీవ్ సిద్ధార్థ నటిస్తున్నాడు. ఓ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ కావాల్సినంత వినోదంతోపాటు అన్ని భావోద్వేగాలను అందించే సినిమాలాగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
లవ్, సితార మూవీ ట్రైలర్
శోభిత ధూళిపాళ్ల నటించిన లవ్, సితార మూవీ సెప్టెంబర్ 27 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే రెండు వారాల ముందే సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ మొదట్లోనే తనకు పెళ్లి, పిల్లలు కావాలని ఉందని శోభితా అనడం ఆసక్తి రేపుతుంది. ఇన్నాళ్లూ పెళ్లంటే ఒంటరిగా ఫీలయ్యే వాళ్లే చేసుకుంటారనే నువ్వే పెళ్లి చేసుకుంటానంటున్నావా అంటూ ఆమె ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు.
ఈ సినిమాలో తార అనే ఇంటీరియర్ డిజైనర్ పాత్రలో ఆమె నటిస్తోంది. ఓ మలయాళీ అయిన ఆమె.. ఓ పంజాబీ చెఫ్ తో ప్రేమలో పడుతుంది. ఎలాగోలా రెండు కుటుంబాలను ఒప్పించి వీళ్లు పెళ్లి చేసుకోవడానికి సిద్దమైనా.. అనుకోకుండా తార కుటుంబంలో అప్పటి వరకూ తెలియని రహస్యాలు బయటకు వస్తుంటాయి. అవి ఆ కుటుంబ మూలాలను కదిలించడంతోపాటు వాళ్ల పెళ్లినీ ప్రశ్నార్థకం చేస్తాయి. తర్వాత ఏం జరిగిందన్నది మూవీలో చూడొచ్చు.
ట్రైలర్ షేర్ చేసిన శోభిత
ఈ మధ్యే నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత శోభిత నటించిన తొలి మూవీ ఇదే. ఈ సినిమా ట్రైలర్ ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. "కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ మేము కేరళలో ఈ స్వీట్ ఫ్యామిలీ డ్రామా షూటింగ్ చేశాం.
సితార మూవీ నా వరకూ ఓ సున్నితమైన, అదే సమయంలో బలమైన పాత్ర" అనే క్యాప్షన్ ఉంచింది. ఈ లవ్, సితార మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా జీ5 ఓటీటీలోకే రాబోతోంది. వందనా కటారియా డైరెక్ట్ చేయగా.. రోనీ స్క్రూవాలా ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీలో శోభిత, రాజీవ్ తోపాటు సొనాలీ కులకర్ణి కూడా నటించింది. జీ5 ఓటీటీలో సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.