Sky Force Collections: అక్షయ్ కుమార్ సినిమాకు రెండో రోజు 75శాతం పెరిగిన కలెక్షన్లు.. ఎట్టకేలకు హిట్ కొట్టనున్నాడా!-sky force day 2 box office collections akshay kumar aerial action movie sees huge growth can this film become hit ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sky Force Collections: అక్షయ్ కుమార్ సినిమాకు రెండో రోజు 75శాతం పెరిగిన కలెక్షన్లు.. ఎట్టకేలకు హిట్ కొట్టనున్నాడా!

Sky Force Collections: అక్షయ్ కుమార్ సినిమాకు రెండో రోజు 75శాతం పెరిగిన కలెక్షన్లు.. ఎట్టకేలకు హిట్ కొట్టనున్నాడా!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 26, 2025 05:01 PM IST

Sky Force Box office Collections: స్కై ఫోర్స్ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ మూవీకి రెండో రోజు భారీ వృద్ధి కనిపించింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Sky Force Collections: అక్షయ్ కుమార్ సినిమాకు రెండో రోజు 75శాతం పెరిగిన కలెక్షన్లు.. ఎట్టకేలకు హిట్ కొట్టనున్నాడా!
Sky Force Collections: అక్షయ్ కుమార్ సినిమాకు రెండో రోజు 75శాతం పెరిగిన కలెక్షన్లు.. ఎట్టకేలకు హిట్ కొట్టనున్నాడా!

బాలీవుడ్ సీనియర్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన స్కై ఫోర్స్ సినిమా జనవరి 24వ తేదీన థియేటర్లలో రిలీజైంది. 1965 భారత్, పాక్ యుద్ధం సమయంలో సర్గోదా వైమానిక స్థావరంపై దాడి ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రిపబ్లిక్ డే వీక్‍లో విడుదలైన స్కై ఫోర్స్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. సందీప్ కెవ్లానీ, అభిషేక్ అనిల్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రెండో రోజు బాగా పుంజుకుంది. ఆ వివరాలు ఇవే..

yearly horoscope entry point

రెండో రోజు భారీ గ్రోత్

స్కై ఫోర్స్ చిత్రానికి రెండో రోజు ఇండియాలో రూ.22 కోట్ల నెట్ కలెక్షన్లు దక్కాయి. తొలి రోజు ఈ మూవీకి దాదాపు రూ.12 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. తొలి రోజుతో పోలిస్తే సెకండ్ డే సుమారు కలెక్షన్లలో సుమారు 75 శాతం గ్రోత్ కనిపించింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బాగా పుంజుకుంది. మొత్తంగా రెండు రోజుల్లో ఈ మూవీ ఇండియాలో రూ.34 కోట్ల నెట్ కలక్షన్లను సొంతం చేసుకుంది.

స్కై ఫోర్స్ చిత్రానికి మౌత్ టాక్ పాజిటివ్‍గా వచ్చింది. అందులోనూ బాలీవుడ్‍లో పెద్దగా పోటీ కూడా లేదు. దీంతో ఈ చిత్రానికి వసూళ్ల జోరు కొనసాగే అవకాశం ఉంది. మూడో రోజైన ఆదివారం రిపబ్లిక్ డే కూడా కావటంతో మరింత గ్రోత్ ఉండొచ్చు. టికెట్ల బుకింగ్స్ ట్రెండ్ బట్టి చూస్తే ఇలాగే కనిపిస్తోంది.

స్కై ఫోర్స్ చిత్రం ఏరియల్ యాక్షన్ మూవీగా వార్ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ వీర్ పహారియా లీడ్ రోల్ చేశారు. సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్, శరద్ కేల్కర్, మోహిత్ చౌహాన్, మనీశ్ చౌదరి, వరుణ్ బదోలా కీలకపాత్రలు పోషించారు.

స్క్రై ఫోర్స్ మూవీని జియో స్టూడియోస్, మాడ్‍డాక్ ఫిల్మ్స్, లియో ఫిల్మ్స్ యూకే ప్రొడక్షన్స్ పతాకాలపై జ్యోతి దేశ్‍పాండే, అమర్ కౌశిక్, భౌమిక్, దినేశ్ విజన్ ప్రొడ్యూజ్ చేశారు. సుమారు రూ.160కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందిందని అంచనా. ఈ చిత్రాన్ని డైరెక్టర్లు సందీప్, అభిషేక్ అనిల్ కపూర్ తెరకెక్కించారు. తనిష్క్ బాగ్చి, జస్టిన్ వర్గీస్ మ్యూజిక్ ఇచ్చారు.

అక్షయ్ హిట్ కొడతారా!

సీనియర్ హీరో అక్షయ్ కుమార్ తన రేంజ్ హిట్ సాధించి సుమారు నాలుగేళ్లు అవుతోంది. వరుసగా చిత్రాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం దక్కడం లేదు. పరాజయాలు ఎదురవుతున్నాయి. 2021లో సూర్యవంశీ చిత్రం రూ.293 కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది. ఆ తర్వాత అక్షయ్‍కు మళ్లీ భారీ హిట్ దక్కలేదు. ఓఎంజీ 2 మోస్తరుగా ఆడింది. నాలుగేళ్లలో సుమారు 10 కమర్షియల్ ప్లాఫ్‍లు చూశారు అక్షయ్. కొన్ని చిత్రాలకు ప్రశంసలు దక్కినా.. వసూళ్లు పెద్దగా రాలేదు. అయితే, అక్షయ్ వరుసగా చిత్రాలు చేస్తూనే వస్తున్నారు. కాగా, స్కై ఫోర్స్ చిత్రం ఇప్పుడు మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద బాగా పర్ఫార్మ్ చేస్తోంది. దీంతో ఈ చిత్రంతో అయినా చానాళ్ల తర్వాత అక్షయ్ తన రేంజ్ హిట్ కొడతారేమో చూడాలి. వీకెండ్ తర్వాత కలెక్షన్ల ట్రెండ్‍తో ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం