Sivarapalli Web Series: తెలుగులో వస్తున్న సూపర్ హిట్ పంచాయత్ వెబ్ సిరీస్.. సివరపల్లి ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఆ రోజే-sivarapalli web series ott release date panchayat web series telugu remake to stream on prime video from 24th january ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sivarapalli Web Series: తెలుగులో వస్తున్న సూపర్ హిట్ పంచాయత్ వెబ్ సిరీస్.. సివరపల్లి ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఆ రోజే

Sivarapalli Web Series: తెలుగులో వస్తున్న సూపర్ హిట్ పంచాయత్ వెబ్ సిరీస్.. సివరపల్లి ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఆ రోజే

Hari Prasad S HT Telugu
Jan 17, 2025 05:33 PM IST

Sivarapalli Web Series: హిందీలో సూపర్ హిట్ అయిన పంచాయత్ వెబ్ సిరీస్ తెలుగు రీమేక్ సివరపల్లి పేరుతో రాబోతోంది. ఈ కామెడీ డ్రామా సిరీస్ ట్రైలర్ ను శుక్రవారం (జనవరి 17) మేకర్స్ రిలీజ్ చేస్తూ.. స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేశారు.

తెలుగులో వస్తున్న సూపర్ హిట్ పంచాయత్ వెబ్ సిరీస్.. సివరపల్లి ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఆ రోజే
తెలుగులో వస్తున్న సూపర్ హిట్ పంచాయత్ వెబ్ సిరీస్.. సివరపల్లి ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఆ రోజే

Sivarapalli Web Series: తెలుగులో మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రానుంది. ఈ సిరీస్ పేరు సివరపల్లి (Sivarapalli). ఇది హిందీలో ఇప్పటికే మూడు సీజన్ల పాట సక్సెస్‌ఫుల్ గా సాగుతున్న పంచాయత్ వెబ్ సిరీస్ కు తెలుగు రీమేక్. ఈ మధ్యే తమిళంలోనూ రీమేక్ అయిన ఈ సిరీస్ ఇప్పుడు తెలుగులో తొలి సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కడుపుబ్బా నవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి.

yearly horoscope entry point

సివరపల్లి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్

సివరపల్లి పేరుతో రాబోతున్న ఈ తెలుగు వెబ్ సిరీస్ జనవరి 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే హిందీ, తమిళ వెర్షన్లు ఇదే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెలుగులోనూ రూపొందించారు. ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) ఈ సిరీస్ ను నిర్మించింది.

"స్వాగతం.. సివరపల్లిలోని అందమైన మనుషులు, కథలను కలిసే సమయం వచ్చేసింది. కొత్త సిరీస్ సివరపల్లి జనవరి 24 నుంచి మీ ప్రైమ్ వీడియోలో" అనే క్యాప్షన్ తో ఈ సిరీస్ ట్రైలర్, స్ట్రీమింగ్ తేదీని ప్రైమ్ వీడియో వెల్లడించింది.

సివరపల్లి వెబ్ సిరీస్ ట్రైలర్ ఎలా ఉందంటే?

సివరపల్లి వెబ్ సిరీస్ ను హిందీ వెబ్ సిరీస్ పంచాయత్ ఆధారంగా తెరకెక్కించారు. అక్కడి ఫులేరా గ్రామం తెలుగులో సివరపల్లిగా మారింది. అదే టైటిల్ ను వెబ్ సిరీస్ కు పెట్టారు. ఇందులో లీడ్ రోల్లో రాగ్ మయూర్ నటించాడు. ఇక మురళీధర్ గౌడ్, రూపా లక్ష్మి, ఉదయ్ గుర్రాల, సన్నీ పల్లె, పావని కరణంలాంటి వాళ్లు కూడా ఇందులో ఉన్నారు.

తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో సాగే సిరీస్ గా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక్కడి పల్లె వాతావరణాన్ని చూపించబోతున్నారు. ఎంటెక్ చదివి పెద్ద ఐటీ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకునే ఓ యువకుడు సివరపల్లికి పంచాయతీ సెక్రటరీగా వచ్చి ఎలాంటి కష్టాలు పడతాడన్నది ఈ వెబ్ సిరీస్ స్టోరీ.

తొలి సీజన్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. తెలంగాణ పల్లెల్లోని పరిస్థితులు, రాజకీయాలు, అనుబంధాలు, ఆత్మీయతలను ఈ వెబ్ సిరీస్ ద్వారా చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ సివరపల్లి వెబ్ సిరీస్ జనవరి 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

హిందీలో సూపర్ హిట్

హిందీలో ఇప్పటికే పంచాయత్ పేరుతో ఓ వెబ్ సిరీస్ వచ్చింది. మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. తొలి సీజన్ 2019లోనే రాగా.. దానినే ఇప్పుడు తెలుగులో రూపొందించారు. హిందీలో ఈ సిరీస్ పెద్ద హిట్. ఇప్పటి వరకూ అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ లలో ఇదీ ఒకటి.

గతేడాది మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకవేళ ఆ సిరీస్ చూడనివాళ్లకు తెలుగులో రాబోయే ఈ సివరపల్లి బాగా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే చూసిన వాళ్లు తెలుగులో ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి.

Whats_app_banner