Bigg Boss Telugu: అర్జున్‍ను చూసి “అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి” అంటూ పాడిన శివాజీ: వీడియో.. ఎందుకంటే..-sivaji sings a song for ambati arjun during ticket finale in bigg boss 7 telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu: అర్జున్‍ను చూసి “అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి” అంటూ పాడిన శివాజీ: వీడియో.. ఎందుకంటే..

Bigg Boss Telugu: అర్జున్‍ను చూసి “అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి” అంటూ పాడిన శివాజీ: వీడియో.. ఎందుకంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 01, 2023 02:31 PM IST

Bigg Boss Telugu 7 Day 89 Promo: బిగ్‍బాస్‍లో టికెట్ టు ఫినాలే కోసం పోటీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా అంబటి అర్జున్‍ను చూసి పాట పాడారు శివాజీ. ఆ వివరాలివే..

అంబటి అర్జున్, శివాజీ
అంబటి అర్జున్, శివాజీ

Bigg Boss Telugu 7 Day 89 Promo: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో నేరుగా ఫైనల్‍కు వెళ్లేందుకు కంటెస్టెంట్ల మధ్య పోటీ జరుగుతోంది. టికెట్ టు ఫినాలే కోసం హౌస్ మేట్స్ పోటీ పడుతున్నారు. దీని కోసం రకరకాల టాస్కులు జరుగుతున్నాయి. టికెట్ టు ఫినాలే రేసులో శోభా శెట్టి, ప్రిన్స్ యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ ఔట్ కాగా.. అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్ పోటీలో ఉన్నారు. నేడు (డిసెంబర్ 1) కూడా బిగ్‍బాస్‍లో టికెట్ టు ఫినాలే టాస్కులు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నేటి ప్రోమో బయటికి వచ్చింది. ఈ క్రమంలో అంబటి అర్జున్‍ను చూసి అనుకున్నది ఒకటి.. అంటూ శివాజీ పాట పడారు. వివరాలివే..

yearly horoscope entry point

స్కోరు బోర్డులో మిగిలిన వారి కంటే తక్కువ స్కోరు ఉన్నందున ఫినాలే అస్త్ర రేసు నుంచి గౌతమ్ కృష్ణ తప్పుకోవాలని బిగ్‍బాస్ చెప్పారు. అలాగే, సాధించిన వాటిలో నుంచి 20 శాతం పాయింట్లను (140 పాయింట్లు) రేసులో ఉన్న పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, అమర్‌దీప్‍లో ఒకరికి ఇవ్వాలని గౌతమ్‍కు తెలిపారు.

దీంతో ఎవరికి పాయింట్లు ఇవ్వాలని తెగ ఆలోచించారు గౌతమ్ కృష్ణ. ప్రియాంక తనకు పాయింట్లు ఇచ్చిన సమయంలోనే తనకు ఓ కండీషన్ పెట్టిందని అర్జున్ వద్దకు వెళ్లి గౌతమ్ చెప్పారు. తన పాయింట్లను అమర్‌కు ఇస్తానన్నారు. “ప్రియాంక నాకు పాయింట్లు ఇచ్చింది కదా. ఒకవేళ నువ్వు ఎవరికైనా పాయింట్లు ఇవ్వాల్సి వస్తే.. అమర్‌కు ఇవ్వాలని తను అన్నది” అర్జున్‍తో గౌతమ్ అన్నారు. దీంతో “నీ ఇష్టం. నేను అడగను” అని అసంతృప్తి చెందారు అర్జున్.

ఇవి ప్రియాంక పాయింట్స్.. ఆమెను ఏమీ అనకు అని అర్జున్‍తో గౌతమ్ చెప్పారు. తన పాయింట్లు అమర్‌కు ఇస్తానని బిగ్‍బాస్‍కు తెలిపారు. ప్రియాంకను ఏమీ అనొద్దని ఇవ్వడం కరెక్ట్ కాదన్నట్టు గౌతమ్‍కు శోభా శెట్టి చెప్పారు.

ఫ్రెండ్ అయిన గౌతమ్ కృష్ణ.. అంబటి అర్జున్‍కు పాయింట్లు ఇవ్వకపోవడంపై శివాజీ సెటైరికల్‍గా పాట పాడారు. “అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి.. బోల్తా కొట్టిందిలే బుల్‍బుల్ పిట్ట” అని అర్జున్‍ను చూస్తూ పాడారు శివాజీ. నవ్వారు కూడా.

గౌతమ్ పాయింట్లు యాడ్ అవడంతో టికెట్ టు ఫినాలేలో అమర్ టాప్ ప్లేస్ మరింత పదిలం అయింది. “అన్న (అమర్) ముఖం కళకళలాడుతోంది. ఇందుకు గాను కట్నాలు చదివించుకునే వారు చదివించుకోండి” అంటూ పంచ్ వేశారు పల్లవి ప్రశాంత్. దీంతో అమర్ ఒక్కసారిగా నవ్వుతూ ఫేస్ టర్నింగ్ ఇచ్చారు. టికెట్ టు ఫినాలేలో ఎవరు ముందుకు వెళ్లనున్నారో నేటి ఎపిసోడ్‍లో తెలియనుంది. మరిన్ని టాస్కులు జరగనున్నాయి. ప్రోమో ఇక్కడ చూడండి.

Whats_app_banner