Amaran OTT: పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ అమరన్ - కానీ ఓ ట్విస్ట్
Amaran OTT: శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ అమరన్ ఓటీటీలోకి వచ్చింది. ఓవర్‌సీస్ ఓటీటీ ఐంథుసన్‌లో రిలీజైంది. ఇండియన్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు మరో పదిహేను రోజుల తర్వాతే ఈ మూవీ రానున్నట్లు సమాచారం.
శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి ఈ బయోపిక్ వార్ డ్రామా మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇండియన్ ఆడియెన్స్ అమరన్ మూవీని చూసే అవకాశం లేదు. ఓవర్‌సీస్ ఓటీటీ ఐంథుసన్‌లో అమరన్ రిలీజ్ అయ్యింది. థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోనే ఓవర్‌సీస్‌లో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కావడం ఆసక్తికరంగా ఆసక్తికరంగా మారింది. కేవలం తమిళ వెర్షన్ మాత్రమే రిలీజైంది.
నెట్‌ఫ్లిక్స్‌లో...
అమరన్ మూవీ ఇండియన్ వెర్షన్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. డిసెంబర్ ఐదు లేదా పదకొండు నుంచి ఓటీటీలో అమరన్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
ఆర్మీ మేజర్ జీవితంతో...
ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా అమరన్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్ నటించగా...ఆయన భార్య రెబెకాగా సాయిపల్లవి కనిపించింది. రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వం వహించిన ఈ బయోపిక్ వార్ డ్రామా మూవీని అగ్ర హీరో కమల్‌హాసన్ ప్రొడ్యూస్ చేశాడు.
15 రోజుల్లో...270 కోట్లు...
అమరన్ మూవీ థియేటర్లలో రిలీజై రెండు వారాలు అవుతోన్న కలెక్షన్స్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. పదిహేను రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 270 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది తమిళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తెలుగు వెర్షన్ ఇప్పటివరకు 35 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్...ఇరవై కోట్ల షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నది. కేవలం ఐదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెలుగులో రిలీజైన ఈ మూవీ నిర్మాతలకు పదిహేను కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం.
గత సినిమాలకు భిన్నంగా...
గతంలో వచ్చిన ఆర్మీ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌కు భిన్నంగా ఎమోషన్స్, యాక్షన్ అంశాల కలబోతగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియాసామి అమరన్ మూవీని రూపొందించిన తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. వృత్తి బాధ్యతల కారణంగా కుటుంబాలకు దూరమై సైనికులు ఎదుర్కొనే చూపిస్తూనే మరోవైపు కశ్మీర్‌లో డ్యూటీ చేసే సైనికులకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతుంటాయన్నది కళ్లకు కట్టినట్లుగా ఈ మూవీలో ఆవిష్కరించారు.
అమరన్ కథ ఇదే...
ముకుంద్ వరదరాజన్ చిన్నతనం నుంచే సైనికుడు కావాలని కలలు కంటాడు. లెఫ్టినెంట్ కల్నల్ ఉద్యోగానికి ఎంపిక అవుతాడు. కాలేజీలో చదువుతోన్న టైమ్‌లోనే రెబెకా వర్గీస్‌ను ప్రేమిస్తాడు. ఆర్మీలో జాబ్ కావడంలో ఇందు కుటుంబసభ్యులు వీరి ముకుంద్‌తో పెళ్లికి అభ్యంతరం చెబుతారు. పెద్దలను ఒప్పించి వీరిద్దరు ఎలా ఒక్కటయ్యారు? ఆర్మీలో మేజర్‌గా పలు సీక్రెట్ ఆపరేషన్స్‌ను వరదరాజన్ ఎలా నిర్వర్తించాడు? అన్నది స్ఫూర్తిదాయకంగా అమరన్ మూవీలో డైరెక్టర్ చూపించారు.