Bigg Boss 6 Telugu 84 Episode: ఇనాయా ఫస్ట్ క్రష్ అతడే - వీకెండ్ ఎపిసోడ్‌కు గెస్ట్‌లుగా వచ్చిన సెలబ్రిటీస్
Bigg Boss 6 Telugu 84 Episode: బిగ్‌బాస్ శనివారం ఎపిసోడ్‌కు మాజీ కంటెస్టెంట్స్‌తో పాటు హౌజ్‌మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ గెస్ట్‌లుగా వచ్చారు. శనివారం ఎపిసోడ్‌లో రాజ్, రోహిత్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీసత్య అన్‌సేఫ్‌గా నిలిచారు. వీరిలో ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.
Bigg Boss 6 Telugu 84 Episode: బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో సెలబ్రిటీలతో పాటు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ సందడిచేశారు. ప్రీవియస్ కంటెస్టెంట్స్ సోహెల్, శివబాలాజీ, లహరి, వితికశేరుతో పాటు నటుడు ప్రభాకర్, విష్ణుప్రియ గెస్ట్ లుగా హాజరై కంటెస్టెంట్స్‌లో జోష్‌ను నింపారు. అయితే వారిని నేరుగా స్టేజ్‌పైకి పిలవకుండా హౌజ్‌కు కొందరు గెస్ట్‌లు, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారని నాగార్జున కంటెస్టెంట్స్‌తో చెప్పాడు నాగార్జున. వారి వాయిస్‌లు మాత్రమే వినిపించాడు. గొంతు ఆధారంగా వచ్చిన వారు ఎవరో గుర్తుపట్టాలని అన్నాడు.
ట్రెండింగ్ వార్తలు
ఇనాయా ఫస్ట్ క్రష్...
తొలుత ఇనాయాకు అవకాశం దక్కింది. తన తమ్ముడి గొంతును ఇనాయా గుర్తుపట్టింది. ఇనాయా తమ్ముడితో పాటు హీరో సొహెల్ హౌజ్‌లోకి వచ్చాడు. తన ఫస్ట్ క్రష్ సొహెల్ అని చెప్పింది ఇనాయా. తన కెప్టెన్సీలో కొత్త రేషన్ మేనేజర్‌గా రోహిత్‌ను ఎంపికచేస్తున్నట్లు ఇనాయా ప్రకటించింది. ఇనాయాపై సొహెల్ సరదాగా పంచ్‌లు వేసి నవ్వించాడు. రేవంత్, శ్రీహాన్ బాగా ఆడుతున్నారని సొహెల్ మెచ్చుకున్నాడు. తర్వాత ఇచ్చిన టాస్క్‌లో ఇనాయా సేఫ్ అయ్యింది. శ్రీహాన్‌కు మరో అమ్మాయితో ఎఫైర్ ఉందంటూ అతడిని ఆటపట్టించాడు సొహెల్
శ్రీహాన్ కోసం శివబాలాజీ...
శ్రీహాన్ కోసం అతడి తండ్రితో పాటు బిగ్‌బాస్ సీజన్ వన్ విన్నర్ శివబాలాజీ గెస్ట్‌లుగా వచ్చారు. శ్రీహాన్, సిరి ప్రేమకథ ఎలా మొదలైందో అతడి ఫాదర్ మొత్తం నాగార్జునతో చెప్పేశాడు. శ్రీహాన్‌కు హౌజ్‌లో కాంపిటీషన్ ఎవరని అడగ్గా రేవంత్ పేరు చెప్పాడు శివబాలాజీ. కాంపిటేట్ కానీ కంటెస్టెంట్ ఎవరని అడగ్గా ఫైమా పేరు చెప్పాడు. 12 వారాల ఆటతీరుకు శ్రీహాన్‌కు 9 మార్కులు ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీహాన్‌ను సేఫ్‌గా తేల్చాడు.
ఫైమా కోసం బుల్లెట్ భాస్కర్...
ఫైమా సిస్టర్ తో పాటు బుల్లెట్ భాస్కర్ బిగ్‌బాస్ స్టేజ్‌పైకి వచ్చాడు. ఫైమాకు కాంపిటీషన్ ఎవరని అడిగిన ప్రశ్నకు ఇనాయా పేరు చెప్పాడు బుల్లెట్ భాస్కర్. పోటీకానీ వారిగా శ్రీసత్యను పేర్కొన్నాడు. తర్వాత ఇచ్చిన టాస్క్‌లో ఫైమా అన్‌సేఫ్ అని వచ్చింది.
గెస్ట్‌గా రోల్ రైడా...
రేవంత్ కోసం అతడి అన్నయ్య సంతోష్‌తో పాటు రోల్ రైడా బిగ్‌బాస్‌కు వచ్చారు. రేవంత్ ఆటతీరుకు అతడి అన్నయ్య సంతోష్ పది మార్కులు ఇచ్చాడు. రేవంత్‌కు కాంపిటీషన్ శ్రీహాన్, పోటీ లేని కంటెస్టెంట్‌గా రోహిత్ పేరు చెప్పాడు. ఆ తర్వాత రోహిత్ కోసం అతడి తమ్ముడితో పాటు నటుడు ప్రభాకర్ గెస్ట్‌లుగా వచ్చారు. రోహిత్‌కు కాంపీటిషన్‌గా రేవంత్ పేరు చెప్పాడు ప్రభాకర్. నో కాంపీటిషన్‌గా రాజ్ పేరు తెలిపాడు. తర్వాత ఇచ్చిన టాస్క్‌లో రోహిత్ అన్ సేఫ్‌గా తేలింది.
లహరి, వితికా షేరు...
ఆ తర్వాత ఆదిరెడ్డి కోసం అతడి సిస్టర్ నాగలక్ష్మి తో పాటు లహరి గెస్ట్‌లుగా వచ్చారు. ఆది ఆటకు తొమ్మిదిన్నర మార్కులు ఇచ్చింది లహరి. ఆదిరెడ్డికి కాంపిటీషన్‌గా రేవంత్, నో కాంపిటేట్‌గా శ్రీసత్య పేరు చెప్పింది లహరి. ఆ తర్వాత ఇచ్చిన టాస్క్‌లో ఆది అన్‌సేఫ్‌గా నిలిచాడు. శ్రీసత్య సిస్టర్ హారికతో పాటు సీరియల్ఆ ర్టిస్ట్ విష్ణు ప్రియ గెస్ట్‌లుగా వచ్చారు. రాజ్ కోసం డాక్టర్ వెంకీతో పాటు సాయిరోనక్ గెస్ట్ లుగా వచ్చారు. రాజ్ అన్ సేఫ్ అయ్యాడు. కీర్తి కోసం ప్రియాంక, వితికశేరు వచ్చారు.