సితారే జమీన్ పర్ ట్రైలర్: ఆమిర్ ఖాన్, జెనీలియా మూవీ.. బాస్కెట్‌బాల్ కోచ్‌గా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. ఫన్నీగా ట్రైలర్-sitaare zameen par trailer released aamir khan played basketball coach genelia reentry ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  సితారే జమీన్ పర్ ట్రైలర్: ఆమిర్ ఖాన్, జెనీలియా మూవీ.. బాస్కెట్‌బాల్ కోచ్‌గా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. ఫన్నీగా ట్రైలర్

సితారే జమీన్ పర్ ట్రైలర్: ఆమిర్ ఖాన్, జెనీలియా మూవీ.. బాస్కెట్‌బాల్ కోచ్‌గా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. ఫన్నీగా ట్రైలర్

Hari Prasad S HT Telugu

సితారే జమీన్ పర్ ట్రైలర్: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, జెనీలియా నటించిన మూవీ ట్రైలర్ మంగళవారం (మే 13) వచ్చేసింది. స్పానిష్ మూవీ ఛాంపియన్స్ కు రీమేక్ అయిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది.

సితారే జమీన్ పర్ ట్రైలర్: ఆమిర్ ఖాన్, జెనీలియా మూవీ.. బాస్కెట్‌బాల్ కోచ్‌గా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. ఫన్నీగా ట్రైలర్

సితారే జమీన్ పర్ ట్రైలర్: ఆమిర్ ఖాన్ మూడేళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించబోతున్న మూవీ సితారే జమీన్ పర్. ఈ సినిమాలో అతడు ఓ బాస్కెట్ బాల్ కోచ్ గా నటిస్తున్నాడు. అతని సరసన జెనీలియా నటించింది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ ను మంగళవారం (మే 13) రిలీజ్ చేశారు. ఇది చాలా సరదాగా సాగిపోయింది.

సితారే జమీన్ పర్ ట్రైలర్

స్పానిష్ మూవీ అయిన ఛాంపియన్స్ కు రీమేక్ ఈ సితారే జమీన్ పర్. 3 నిమిషాలకుపైగా ఉన్న ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో మానసిక దివ్యాంగుల బాస్కెట్ బాల్ టీమ్ కోచ్ గా ఆమిర్ ఖాన్ నటించాడు. నిజానికి అతడో సాధారణ టీమ్ కోచ్. కానీ తాగి కారు నడిపిస్తూ పోలీస్ వాహనాన్నే ఢీకొడతాడు. కోర్టు మెట్లెక్కుతాడు.

అక్కడ జడ్జి అతనికి మూడు నెలల పాటు మానసిక దివ్యాంగుల బాస్కెట్ బాల్ జట్టుకు కోచింగ్ ఇవ్వాలని ఆదేశిస్తుంది. వాళ్లను పిచ్చోళ్లు అన్నందుకు అతనికి మరో రూ.5 వేల జరిమానా కూడా విధిస్తుంది. అక్కడే అతని కష్టాలు మొదలవుతాయి. అలాంటి టీమ్ కు కోచింగ్ అంటే సవాలే. ఆ సవాలను అతడు ఎలా తట్టుకుంటాడన్నదే ఈ సితారే జమీన్ పర్ మూవీ కథ. 2007లో వచ్చిన తారే జమీన్ పర్ మూవీకి ఇది సీక్వెల్ గా చెబుతున్నారు.

సితారే జమీన్ పర్ మూవీ గురించి..

సితారే జమీన్ పర్ మూవీని ఆర్ఎస్ ప్రసన్న డైరెక్ట్ చేశాడు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సినిమాను నిర్మించింది. ఏకంగా 10 మంది నటీనటులను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నారు.

తారే జమీన్ పర్ మూవీలో తాను పోషించిన పాత్రకు పూర్తి భిన్నమైన పాత్రగా ఇది ఉంటుందని గతంలో ఆమిర్ ఖాన్ చెప్పాడు. ఈ సినిమా ప్రేక్షకులను బాగా నవ్విస్తుందని అతడు స్పష్టం చేశాడు. జూన్ 20న సితారే జమీన్ పర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

దాదాపు రెండేళ్ల తర్వాత జెనీలియా మళ్లీ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ ఛద్దా మూవీస్ వరుస ఫ్లాపుల తర్వాత ఆమిర్ ఖాన్ ఈ సితారే జమీన్ పర్ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం