తెలుగు బాక్సాఫీస్ దగ్గర చిన్న చిత్రాల జోరు కొనసాగుతోంది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ ‘సింగిల్’, సమంత ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ మూవీ ‘శుభం’ థియేటర్లలో ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఓ వైపు సింగిల్ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లోంది. మరోవైపు మిక్స్ డ్ టాక్ వచ్చినా శుభం కూడా సత్తాచాటుతోంది.
సింగిల్, శుభం సినిమాల ఓటీటీ వేదికలు ఇప్పటికే ఖరారయ్యాయి. శ్రీ విష్ణు కామెడీ ట్రయాంగిల్ రొమాంటిక్ సినిమా సింగిల్ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. శ్రీ విష్ణు కెరీర్ లోనే అత్యధిక డిజిటల్ రేటు పలికిన సినిమాగా సింగిల్ రికార్డు నమోదు చేసింది. ఈ మూవీ కోసం ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసిందని తెలిసింది.
శ్రీ విష్ణు సింగిల్, సమంత నిర్మించిన శుభం మూవీ దాదాపు ఒకే రోజు ఓటీటీలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా అయితే థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలకు మూవీలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే సింగిల్, శుభం సినిమాలు జూన్ ఫస్ట్ వారంలో ఓటీటీలోకి రావొచ్చు. జూన్ 5వ తేదీకి అటూ ఇటూగా ఈ రెండు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
థియేటర్లలో ఒకే రోజు రిలీజైన సింగిల్, శుభం సినిమాలు ఓటీటీలోనూ క్లాష్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలు డిఫరెండ్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి కాబట్టి ఆ ప్లాట్ ఫామ్స్ ఒకే డేట్ రోజు రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదు.
సింగిల్, శుభం మూవీ కలెక్షన్లు క్రమంగా పెరుగుతున్నాయి. లవ్ ట్రయాంగిల్ కామెడీ రొమాంటిక్ మూవీగా వచ్చిన సింగిల్.. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.16.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక సీరియల్స్ చూస్తూ దెయ్యాలుగా మారే మహిళల కథతో హారర్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన శుభం మూడు రోజుల్లో రూ.5.25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
సంబంధిత కథనం