సింగిల్ మూవీతో హ్యాట్రిక్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు శ్రీవిష్ణు. ఎనిమిది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 23 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. నిర్మాతలకు ఐదు కోట్లకుపైనే లాభాలను తెచ్చిపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.సింగిల్ మూవీ సక్సెస్ మీట్‌ను సోమవారం మేకర్స్ నిర్వహించారు. ఈ వేడుకలో సింగిల్ మూవీపై శ్రీవిష్ణు ఆసక్తి కర కామెంట్స్ చేశాడు.
సింగిల్ మూవీ కథను మూడేళ్ల క్రితమే డైరెక్టర్ కార్తీక్ రాజు నాకు చెప్పారు. అంతకుముందు ఈ కథని ఒక 15 మంది హీరోలు రిజెక్ట్ చేశారు వాళ్లందరికీ కూడా థాంక్యూ . సినిమాని చాలా కసిగా చేసాం. నా కసిలో పాలుపంచుకున్న వెన్నెల కిషోర్‌కు థాంక్యూ. సింగిల్‌తో ఖచ్చితంగా సక్సెస్ కొడతానని అనుకున్నాను. అదే జరిగింది. . హానెస్ట్ గా ఏది చేసినా దేవుడు మనకి మంచి రిజల్ట్ ఇచ్చేస్తాడు.కేవలం నవ్వుకోవడానికే తీసిన సినిమా అని సక్సెస్ మీట్‌లో శ్రీవిష్ణు అన్నాడు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సింగిల్ రషెస్ చూసిన తర్వాత శ్రీవిష్ణుని పిలిచి గీతా ఆర్ట్స్ లో మరో రెండు సినిమాలు చేయాలని చెక్ ఇచ్చాను. యాక్టర్ గా తను అంత నచ్చాడు. శ్రీవిష్ణుతో నా ప్రయాణం ఇంకా ముందు ముందు ఉంటుంది. ఈ మూవీతో వ్యక్తిగత సలహాలు తీసుకునేంతగా వెన్నెల కిషోర్ నాకు దగ్గర అయ్యారు.యువ దర్శకులంతా వచ్చి ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేయడం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పారు.
ఈ సినిమా కోసం శ్రీ విష్ణు తో కలిసి సాగించిన జర్నీ మర్చిపోలేనని వెన్నెల కిషోర్ చెప్పారు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇందులో సెకండ్ హీరో మీరే అంటూ ఎప్పుడు చెప్పేవారు. లాంటి వ్యక్తి చాలా అరుదు.శ్రీవిష్ణు లేకపోతే అరవింద్ క్యారెక్టర్ కి ఇంత మంచి ఎలివేషన్ రాదు. శ్రీవిష్ణుతో భవిష్యత్తులో మరిన్ని సినిమాలో పనిచేయాలని ఉంది అని వెన్నెలకిషోర్ అన్నారు. రు. వెన్నెలకిషోర్ కు తాను బిగ్ ఫ్యాన్ అని, ఆయన్ని ఊహించుకునే అరవింద్ క్యారెక్టర్ రాసినట్లు డైరెక్టర్ చెప్పారు.
సింగిల్ సక్సెస్ మీట్‌కు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, వివేక్ ఆత్రేయ, కిషోర్ తిరుమల, రామ్ అబ్బరాజుతో పాటు మరికొంత మంది టాలీవుడ్ డైరెక్టర్లు అటెండ్ అయ్యారు.
సింగిల్ మూవీకి కార్తీక్ రాజు దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో శ్రీవిష్ణుకు జోడీగా ఇవానా, కేతికా శర్మ హీరోయిన్లుగా నటించారు.
సంబంధిత కథనం