ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ కామెడీ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ..ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ.. సింగిల్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?-single movie ott release digital streaming on amazon prime video from today sree vishnu ketika sharma ivana ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ కామెడీ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ..ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ.. సింగిల్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ కామెడీ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ..ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ.. సింగిల్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తెలుగు రీసెంట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కామెడీ మూవీ సింగిల్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (జూన్ 6) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ మూవీ అదరగొడుతోంది. తక్కువ బడ్జెట్ తో వచ్చిన మూవీ కలెక్షన్లలో దుమ్మురేపింది. ఆ మూవీ ఓటీటీ వివరాలివే.

ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ మూవీ (x)

ట్రెండింగ్ మీమ్స్, మూవీ రిఫరెన్స్ లతో యూత్ కు తగ్గట్లు కామెడీ క్రియేట్ చేసి.. ఇద్దరు హీరోయిన్ల మధ్యలో నలిగిపోయే హీరో క్యారెక్టర్ ను ఫన్నీగా ఎలివేట్ చేసిన మూవీ ‘సింగిల్’. ఈ మూవీ థియేటర్లలో బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఫ్యాన్స్ ను కడుపుబ్బా నవ్వించేసింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను అలరించేందుకు వచ్చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ బాట పట్టింది.

ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్

శ్రీ విష్ణు హీరోగా వచ్చిన లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘సింగిల్’. ఈ మూవీ మే 9న థియేటర్లలో రిలీజైంది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా యాాక్ట్ చేశారు. ట్రయాంగిల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించింది. ఈ సినిమా ఇప్పుడు నెల రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (జూన్ 6) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

అయిదు భాషల్లో

థియేటర్లలో తెలుగులో రిలీజైన సింగిల్ మూవీ ఓటీటీలో మాత్రం అయిదు భాషల్లో వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాలం, కన్నడ, హిందీ భాషల్లో సింగిల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఫ్యాన్స్ ను నవ్వించిన ఈ మూవీ శుక్రవారమే ఓటీటీలోకి అడుగుపెట్టింది. 129 నిమిషాల రన్నింగ్ టైమ్ ఉన్న ఈ మూవీ థియేటర్లలో రూ.25 కోట్లు కొల్లగొట్టింది.

సామజవరగమన, ఓం భీమ్ భుష్ తర్వాత సింగిల్ మూవీతో శ్రీ విష్ణు హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఈ మూవీకి కార్తీక్ రాజు డైరెక్టర్. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు.

కథ ఏమిటంటే?

విజ‌య్ (శ్రీవిష్ణు) ఓ బ్యాంక్ ఎంప్లాయ్‌. జీవితంలో ఒక్క అమ్మాయినైనా ప్రేమ‌లో ప‌డేయాల‌న్న‌ది అత‌డి ల‌క్ష్యం. స్కూల్‌, కాలేజీ డేస్‌లో చాలా మంది అమ్మాయిల‌కు ప్ర‌పోజ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయిలంతా విజ‌య్ ప్రేమ‌ను రిజెక్ట్ చేస్తారు. జీవితాంతం సింగిల్‌నే ఉండాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. అలాంటి టైమ్‌లోనే పూర్వ (కేతికా శర్మ) అనే అమ్మాయి అత‌డి మ‌న‌సును దోచేస్తుంది. తొలిచూపులోనే పూర్వ‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు విజ‌య్‌. ఆమెకు ప్ర‌పోజ్ చేస్తాడు.

అదే టైమ్‌లో విజ‌య్ లైఫ్‌లోకి హ‌రిణి ( ఇవానా) ఎంట్రి ఇస్తుంది. విజ‌య్‌ని ప్రేమిస్తున్న‌ట్లు చెబుతుంది. విజ‌య్ ప్రేమ‌ను తిర‌స్క‌రించిన పూర్వ మ‌ళ్లీ అత‌డికి ఎందుకు వెతుక్కుంటూ వ‌చ్చింది? హ‌రిణి ప్ర‌పోజ‌ల్‌కు విజ‌య్ ఎలా రియాక్ట్ అయ్యాడు? పూర్వ‌, హ‌రిణిల‌లో ఎవ‌రి ప్రేమ‌ను విజ‌య్ ద‌క్కించుకున్నాడు? సింగిల్‌నే ఉండాల‌ని అనుకున్న విజ‌య్ ఎవ‌రితో మింగిల్ అయ్యాడు? విజ‌య్ ఫ్రెండ్ అర‌వింద్ (వెన్నెల కిషోర్) ల‌వ్‌స్టోరీ ఏ మ‌లుపులు తిరిగింది? ఈ క‌థ‌లోకి మూర్తి (రాజేంద్ర ప్రసాద్ ) ఎలా ఎంట‌ర్ అయ్యాడు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం