తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ‘సింగిల్’ స్ట్రాంగ్ పాజిటివ్ టాక్‍తో దుమ్మురేపుతోంది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ దిశగా సాగుతోంది. మే 9న విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. ఈ మూవీకి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ఫుల్ ఫన్‍తో ఎంటర్‌టైనింగ్‍గా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తోంది. సోమవారం కూడా సింగిల్ సత్తాచాటింది.
సింగిల్ సినిమా తొలి మూడు రోజుల్లో మంచి జోరు చూపింది. దీంతో వీకెండ్ తర్వాత సోమవారం జోరు కొనసాగిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ చిత్రం సోమవారం పరీక్షను పాసైపోయింది. ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.19.01 కోట్లను దక్కించుకుంది. సోమవారమైన నాలుగో రోజు ఈ సినిమాకు సుమారు రూ.3కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
వీకెండ్ తర్వాత ఫస్ట్ మండే సింగిల్ చిత్రం మంచి కలెక్షన్లు దక్కించుకోవడంతో జోరు మరింత కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో స్ట్రాంగ్ రన్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. సమంత నిర్మించిన శుభం చిత్రానికి మిక్స్డ్ టాక్ రావటం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం. సింగిల్‍కు ఇతర సినిమాల నుంచి పెద్దగా పోటీ కూడా లేదు.
సింగిల్ సినిమా దాదాపు అన్ని ఏరియాల్లో లాభాల్లోకి వచ్చేసిందని తెలుస్తోంది. ఈ చిత్రం సుమారు సుమారు రూ.15కోట్ల గ్రాస్ టార్గెట్‍తో వచ్చింది. ఆ మార్కును దాటేసింది. నాలుగు రోజుల్లో అన్ని ఏరియాల్లోనూ ప్రాఫిట్ జోన్‍లోకి వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా శ్రీవిష్ణుకు మరో హిట్ దక్కేసింది.
సింగిల్ సినిమాను కామెడీతో ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కించారు డైరెక్టర్ కార్తీక్ రాజు. ఈ చిత్రంలో శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఈ సినిమా శ్రీవిష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. మొత్తంగా ఈ చిత్రంలో ఫన్ బాగా జనరేట్ అయింది. దీంతో స్ట్రాంగ్ మౌత్ టాక్ వచ్చింది.
బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటాడు విజయ్ (శ్రీవిష్ణు). గర్ల్ ఫ్రెండ్ కావాలని ఆరాటపడుతుంటాడు. ఈ క్రమంలో పూర్వ నెట్టమ్ (కేతిక శర్మ)ను చూసి ఇష్టపడతాడు. ఓ కార్ల షోరూంలో పని చేస్తుందని తెలుసుకొని వెంటపడతాడు. కారు కొనేందుకు వస్తున్నానని అబద్ధం చెప్పి పూర్వను ప్రేమలో పడేందుకు ట్రై చేస్తాడు. కొన్నాళ్లకు పూర్వకు నిజం తెలుస్తుంది. బుద్ధి చెప్పాలనుకొని విజయ్‍తో బాగా ఖర్చు పెట్టిస్తుంది. ఇంతలోనే విజయ్‍ను హరిణి (ఇవానా) ప్రేమిస్తుంది. ఆమెకు విజయ్ నో చెబుతూనే ఉంటాడు. పూర్వ వెంట పడుతుంటాడు. ఆ తర్వాత ఏమైంది? విజయ్‍ను హరిణి ఎందుకు ప్రేమిస్తుంది? పూర్వ, హరిణిలో ఎవరితో విజయ్ కలిశాడు? అనేవి సింగిల్ సినిమాలో ఉంటాయి.
సింగిల్ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్, కాల్యా ఫిల్మ్స్ బ్యానర్లపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ప్రొడ్యూజ్ చేశారు. భాను భోగవరపు, నందు డైలాగ్స్ అందించారు. ఈ మూవీలో సింగిల్ లైన్స్ బాగా పేలాయి.
సంబంధిత కథనం
టాపిక్